బిగ్‌బాస్ హౌసులో నామినేషన్స్ హీట్ మాములుగా లేదు. కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో లాజిక్స్ కంటే అవసరమైన సోది ఎక్కువైంది. రైతుబిడ్డ ప్రశాంత్ అయితే అపరిచితుడులా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. చెప్పింది అర్థం చేసుకోకుండా ఏదేదో అరుస్తూ రెచ్చిపోయాడు. శివాజీ విషయంలోనూ అందరికీ చిన్న షాక్ తగిలింది. ఇంతకీ సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 43 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
శివాజీకి సమస్యలు
నయని పావని ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఆమె వెళ్లిపోవడంతో అందరూ అలానే షాక్‌లో ఉండిపోయారు. ఉదయానికి మళ్లీ నార్మల్ మూడ్‌లోకి వచ్చేశారు. ఐదోవారం ఓ గేమ్‌లో భాగంగా శివాజీ భుజానికి గాయమైంది. దాదాపు 10 రోజులకు పైగా అలానే మెంటైన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అతడిని ఎక్స్‌రే తీసేందుకు బయటకు తీసుకెళ్లి మళ్లీ రాత్రికి తిరిగి తీసుకొచ్చేశారు. ఏదో పెద్ద మనిషిలా అందరికీ సలహాలిస్తూ వారం వారం గడిపేస్తున్న శివాజీకి.. ఎలిమినేట్ చేసి రెస్ట్ ఇస్తే మంచిదేమో!
(ఇదీ చదవండి: హిందీ 'బిగ్‌బాస్'లోకి తెలుగు హీరోయిన్.. ఆ డైరెక్టర్ ముద్దుపై క్లారిటీ)
నామినేషన్స్ షురూ
ఈ వారం నామినేషన్స్ లో భాగంగా కంటెస్టెంట్ ఎదురుగా ఉన్న కుండ పగలగొట్టి కారణం చెప్పాలని అన్నారు. అయితే ప్రశాంత్, అశ్విని, భోలె.. తమని నామినేట్ చేస్తున్నారని ఫ్రస్టేట్ అయిపోయి టైం మొత్తం తినేశారు. దీంతో సోమవారం కేవలం ఏడుగురు మాత్రమే తమ తమ నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లు మంగళవారం నామినేషన్ ప్రక్రియని పూర్తి చేస్తారు.
ఎవరు.. ఏ ఇద్దరిని నామినేట్ చేశారు?
ప్రశాంత్- సందీప్, తేజ
అమరదీప్- భోలె, అశ్విని
పూజామూర్తి- భోలె, అశ్విని
సందీప్- భోలె, ప్రశాంత్
అర్జున్- భోలె, అశ్విని
ప్రియాంక- అశ్విని, భోలె
తేజ- పూజా, ప్రశాంత్
(ఇదీ చదవండి: ఏడాది నుంచి దానికి దూరమైన సమంత.. ఎంత కష్టమో!)
రైతుబిడ్డ ప్రశాంత్ అబద్ధాలు
రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో హౌసులోకి వచ్చిన ప్రశాంత్.. తొలివారం నుంచి కాస్త డిఫరెంట్‌గానే ఉన్నాడు. గేమ్స్ ఉంటే బాగా ఆడటం, మిగిలిన టైం అంతా శివాజీ వెనకాల తిరగడం, నామినేషన్స్ అంటే అవతల వాళ్లు ఏం చెబుతున్నారో వినిపించుకోకుండా అరిచి గోల చేయడం. ఈసారి కూడా అదే చేశాడు. సందీప్.. కెప్టెన్సీ సరిగా చేయలేకపోయావ్ కదా అని అన్నాడు. అయితే ఈ విషయాన్ని పక్కదారి పట్టించి.. సందీప్ తనని 'ఊరోడు' అన్నాడని గట్టిగా అరుస్తూ చెప్పాడు. అయితే ఇది నిజమైతే పొలం, తినే అన్నంపై ఒట్టు వేయ్ అని సందీప్ అడగ్గానే మళ్లీ మాట మార్చేశాడు. రైతు అనేవాడు పొలంపై ఒట్టు వేయడు అని ఏదేదో చెప్పి కాస్త అతి చేశాడు. సందీప్ మాట్లాడుతుంటే అతడు చెబుతున్నది వినకండా పదే పదే మాటలకు అడ్డు తగిలాడు. ఈ మొత్తం వ్యవహారంలో సందీప్ కూల్ గా ఉండటానికి ట్రై చేస్తే.. ప్రశాంత్ మాత్రం ఫుటేజీ ఇవ్వడానికి ప్రయత్నించాడా అనే డౌట్ వచ్చింది.
తట్టుకోలేకపోయిన అశ్విని, భోలె
అమరదీప్, పూజా,అర్జున్, ప్రియాంక.. ఇలా వరసగా అందరూ తనని నామినేట్ చేసేసరికి అశ్విని కూడా తట్టుకోలేకపోయింది. తనతో ఎవరూ కలవట్లేదని, మాట్లాడట్లేదని ఒకే కారణాన్ని గుచ్చిగుచ్చి చెప్పింది. దీంతో నామినేట్ చేసినవాళ్లకేమో గానీ చూస్తున్న ప్రేక్షకులకు ఫ్రస్టేషన్ వచ్చేసింది. ఇక భోలె అయితే మరోరకం. అమరదీప్, పూజా తనని నామినేట్ చేసినా భోలె ఏం మాట్లాడలేదు. వాళ్లు చెప్పిన కారణాల్ని అస్సలు డిఫెండ్ చేయలేదు. ఏదో అవతలి వాళ్ల ఆనందమే తనకు ముఖ్యమున్నట్లు ప్రవర్తించాడు. ఇక ప్రియాంక నామినేట్ చేసిన తర్వాత ఆమెని ఇరిటేట్ చేస్తూ పాటలు పాడుతూ, జోక్స్ వేస్తూ ఇబ్బంది పెట్టాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: ఖరీదైన తప్పులు చేశాం.. 'భోళా శంకర్' నిర్మాత షాకింగ్ ట్వీట్)
Comments
Please login to add a commentAdd a comment