బిగ్‌బాస్ 7 విజేత ప్రశాంత్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. నాంపల్లి కోర్టు ఇతడికి శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా జైలు నుంచి బయటకొచ్చాడు. ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు.. ప్రశాంత్‌ని ఆదేశించింది. అసలు ఈ గొడవేంటి? ప్రశాంత్‌ని ఎందుకు జైల్లో పెట్టారు?
(ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!)
తెలంగాణలోని ఓ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ప్రశాంత్.. తనని తాను రైతుబిడ్డగా చెప్పుకొన్నాడు. అలా ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి బిగ్‌బాస్ షోలో కామన్‌మ్యాన్ అనే ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 105 రోజుల పాటు హౌసులో ఉండి విజేతగా నిలిచాడు. అయితే ఫినాలేలో విజయం సాధించిన తర్వాత షో నిర్వహించిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా గొడవ జరిగింది. అమర్, అశ్విని, గీతూతో పాటు పలువురు కార్లని ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు.
అయితే షోలో విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్.. ఫ్యాన్స్‌ని కలిసేందుకు ప్రయత్నించగా తొలుత పోలీసులు వద్దని వారించారు. కానీ పోలీసుల మాటలని లెక్కచేయకుండా, పంపేచేసిన సరే తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. వీరంగం సృష్టించాడు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడిగా ప్రశాంత్ పై సుమోటాగా కేసు నమోదు చేశారు. రీసెంట్‌గానే ప్రశాంత్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న ఇతడు తాజాగా బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇతడిని చూసేందుకు జైలు దగ్గరకు కూడా అభిమానులు చాలామంది వచ్చారు.
(ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి)
Comments
Please login to add a commentAdd a comment