
హైదరాబాద్: బిగ్‌బాస్ గొడవలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్‌బాస్ ఫైనల్స్ అనంతరం విజేత ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్‌చౌదరి అభిమానులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడి బస్సులు, కార్లను ధ్వంసం చేసి పోలీసులపై రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడు మహావీరంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా శనివారం వీరిద్దరూ బెయిల్‌పై వచ్చారు. అలాగే ఈ విధ్వంసానికి పాల్పడిన 12 మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. తాజాగా సరూర్‌నగర్‌కు చెందిన హరినాథ్‌రెడ్డి, యూసుఫ్‌గూడలకు చెందిన ఎం. సుధాకర్‌లను ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పవన్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.