కామన్ మ్యాన్ టైటిల్ ఎగరేసుకుపోవడం బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి! ఇంతవరకు తెలుగులో కామన్ మ్యాన్ రన్నరప్ వరకు కూడా వచ్చిందే లేదు. అలాంటిది రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన పేరు చానా ఏండ్లు యాదుండేలా బిగ్‌బాస్ 7 టైటిల్ సాధించేశాడు. జనాలు టాస్కులు ఒక్కటే చూడరు.. వారి మాటతీరు, ప్రవర్తననే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు.
వినయం, విధేయత ఎక్కడ?
అలా ప్రశాంత్ వినయ, విధేయత చాలామందిని కట్టిపడేసింది. పొగడ్తలకు ఉప్పొంగిపోకుండా ఒదిగి ఉండే తీరుకు ప్రేక్షకులు ముచ్చటపడ్డారు, గెలిపించారు. ఇక్కడివరకు అంతా బానే ఉంది.. కానీ తర్వాతే సీన్ రివర్స్ అయింది. టైటిల్ గెలిచిన తర్వాత ప్రశాంత్ కాళ్లు భూమి మీద లేవు. గాల్లో తేలుతున్నాడు. షోలోకి వెళ్లడం కోసం యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చి తనకు సపోర్ట్ చేయమన్న రైతుబిడ్డ ఇప్పుడు కప్పుతో వచ్చిన తర్వాత యూట్యూబ్ యాంకర్లను అస్సలు పట్టించుకోవడం లేదట. అంతే కాదు ఇంటర్వ్యూ అడిగితే కూడా చాలా దురుసుగా, చులకన చేసి మాట్లాడుతున్నాడట.
ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదే!
ఒక్క ఇంటర్వ్యూ అని అడిగితే.. 'మీరు మా పొలం దగ్గరకు రండి.. పనులు చేయండి.. వీడియో తీసుకోండి. మీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి రైతులకు ఏమిస్తారో చెప్పుర్రి. ఆ తర్వాతే మీకు ఇంటర్వ్యూలు ఇస్తా..' అంటూ అతి చేస్తూ మాట్లాడాడు. ఇక మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోయిన దాదాపు 15 గ్రామాల రైతులకు గతంలో ఏమైనా సాయం చేశారా? వారికి అండగా నిలిచారా? అని ఓ యాంకర్ అడిగాడు. దీనికి ప్రశాంత్ స్పందిస్తూ.. 'నాకేమైనా సీఎం పదివి ఇచ్చిర్రా? ఏదైనా చేయడానికి! నేను ఒక రైతుబిడ్డను కదా.. సీఎం చేస్తరా చెప్పుండ్రి.. అందరినీ ఆదుకుంటా.. నేనేమైనా నాయకుడినా? నేనూ ఒక రైతుబిడ్డనే.. నేనేం చేస్తా' అని వెటకారంగా నవ్వుతూ సమాధానమిచ్చాడు.
ఫ్రెండ్స్‌ను సైతం లెక్కచేయట్లేదా?
ఈ ప్రవర్తనను బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యాంకర్ శివ తప్పుపట్టాడు. 'ప్రశాంత్.. 18 గంటలు వెయిట్ చేయించి ఇంటికి రా అన్నా.. ఇంటర్వ్యూ ఇస్తా అని పిలిచాడు. తీరా అక్కడికి వెళ్తే ఇంటి బయట 8 గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వను.. వెళ్లిపోమని దురుసుగా మాట్లాడాడు. గొప్ప విన్నర్ ప్రశాంత్.. అక్కడే ఉన్న తన స్నేహితులను కూడా అతడు లెక్క చేయడం లేదు.. ఇవన్నీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని పెట్టలేదు.. ఇవ్వను అని చెప్పే విధానం బాలేదు' అని మండిపడ్డాడు. రైతులకు ఏం చేస్తారో చెప్తేనే ఇంటర్వ్యూలు ఇస్తానన్న వీడియోను షేర్ చేస్తూ.. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు ఇంటర్వ్యూలు ఇచ్చావుగా.. అప్పుడు లేని కండీషన్స్ ఇప్పుడెందుకు? ఆరోజు రైతుకి ఏమైనా ఇవ్వమని ఎందుకు చెప్పలేదు? అని వరుస ప్రశ్నలు అడిగాడు.
ఇన్నాళ్లూ మాస్క్ వేసుకున్నాడా?
మరోవైపు గ్రాండ్ ఫినాలే రోజు స్టూడియో బయట గందరగోళం నెలకొన్న పరిస్థితి తెలిసిందే! అమర్, గీతూ, అశ్విని కారు అద్దాలతో పాటు అక్కడి బస్సు అద్దాలు సైతం పగిలిపోయాయి. శాంతి భద్రతల సమస్య కారణంగా వెళ్లిపోమని పోలీసులు చెప్తుంటే.. ప్రశాంత్ అది అర్థం చేసుకోకుండా పోలీసులు రైతుబిడ్డకు విలువ ఇవ్వడం లేదంటూ వీడియో తీశాడు. ఇదంతా చూసిన నెటిజన్లు.. ప్రశాంత్ ఇన్నాళ్లూ బిగ్‌బాస్ హౌస్‌లో మాస్క్ వేసుకునే ఉన్నాడు, బిగ్‌బాస్‌కు రాకముందు ప్రశాంత్ ఏమైనా రైతులకు సాయం చేశాడా? లేదు కదా.. ఎందుకింత పొగరుగా వ్యవహరించడం? యాటిట్యూడ్, తలపొగరు చూపించకుండా సమాధానాలు చెప్పి ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
#BiggBossTelugu7 is immature or arrogance #PallaviPrashanth. Omg he just lost the plot pic.twitter.com/pu53KsS8a4
— telugu guy (@nthony_venky) December 19, 2023
చదవండి: 35 ఏళ్ల వయసులోనూ స్లిమ్‌గా.. అరడజను సినిమాలతో ఫుల్ బిజీ..
Comments
Please login to add a commentAdd a comment