
గేమ్‌లో తప్పొప్పులు, గెలుపోటములు సహజం. తప్పులు సరి చేసుకుని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపు దిశగా అడుగులు వేయడమే అసలైన విజయం. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో జరిగే సంఘటనలను కొందరు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. కొన్ని పీఆర్ టీమ్స్ వారి కంటెస్టెంట్‌కు హైప్ ఇవ్వడానికి బదులు అవతలవారిని దూషిస్తూ నిందలేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అవతలి కంటెస్టెంట్ కుటుంబసభ్యులు ఈ ట్రోలింగ్ వల్ల ఎంత బాధపడతారనేది ఆలోచించడం లేదు.
అమర్‌దీప్‌పై రైతుబిడ్డ ఫ్యాన్స్, పీఆర్ ట్రోలింగ్!
ఈ సీజన్‌లో రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. హౌస్‌లో వెళ్లడానికి ముందే అతడు గట్టి పీఆర్‌ను రెడీ చేసుకుని వెళ్లాడని చాలాకాలం నుంచే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే నిజమని తెలుస్తోంది. అయితే వాళ్లు ప్రశాంత్‌ను పొగడటానికి బదులు అవతలివారిని చులకన చేసి మాట్లాడుతూ వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ఈ ట్రోలింగ్‌తో మనస్తాపానికి గురైన అమర్‌దీప్ తల్లి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహించింది.
(ఇదీ చదవండి: ప్రేక్షకుల గుండెల్ని తాకిన నయని పావని.. ఈ కారణంతో నో రీ ఎంట్రీ)
నన్ను ప్రశాంత్ దగ్గరకు పంపిస్తావా?
'నేను అమర్‌దీప్ తల్లిని.. మీకు ఏమైనా మతుండే అలాంటి కామెంట్స్ పెడుతున్నారా? కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? పల్లవి ప్రశాంత్ ఏమైనా పై నుంచి దిగివచ్చాడా? ప్రశాంత్ దగ్గరకు అమర్‌దీప్ భార్య(తేజస్విని)ని, తల్లిని పంపిస్తావా? ఏం మాట్లాడుతున్నావ్‌రా.. పల్లవి ప్రశాంత్ మీద ప్రేముంటే ఓట్లేసి గెలిపించుకోరా.. అంతేకానీ తల్లి, భార్యల జోలికి వస్తే ఇంటికి వచ్చి కొడతా. నేను అమ్మను రా.. నన్ను ప్రశాంత్ దగ్గరకు పంపిస్తావా? ఎవడ్రా నీకు చదువు నేర్పింది? కొంచెమైనా సంస్కారం ఉందా?
మానసికంగా చంపుతున్నారు
మీవి నీచమైన బతుకులు. మీ మాటల వల్ల ఎంత బాధపడుతున్నాంరా.. మానసికంగా చంపేస్తున్నారు. నాగార్జున దగ్గరకు వెళ్లి ఇదే విషయం మాట్లాడతా.. ఏమనుకుంటున్నారో, జాగ్రత్త..' అంటూ ఏడ్చేసింది. ఇది చూసిన జనాలు కంటెస్టెంట్ల ఆట గురించి మాట్లాడాలి కానీ వారి కుటుంబాలను ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు? వారికెందుకు నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ పీఆర్ చెత్తగా ప్రవర్తిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
(ఇదీ చదవండి: శ్రీలీల తనకు ఏమవుతుందో మొదటిసారి రివీల్ చేసిన అనిల్ రావిపూడి)
Comments
Please login to add a commentAdd a comment