Bigg Boss 7 Finale Highlights: బిగ్‌బాస్ 7వ విజేతగా రైతుబిడ్డ ప్రశాంత్ | Bigg Boss Telugu Season 7 Grand Finale Live Updates: Who Will Win? | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Finale Episode Highlights: ట్రోఫీ రైతుబిడ్డదే.. శివాజీని మించిపోయిన అమర్

Published Sun, Dec 17 2023 6:53 PM | Last Updated on Mon, Dec 18 2023 5:35 AM

Bigg Boss Telugu Season 7 Grand Finale Live Updates: Who Will Win? - Sakshi

105 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్ 7 షోకి ఎట్టకేలకు పూర్తయింది. ఆదివారం అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫినాలేకి అమర్‌‌దీప్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, యావర్, అర్జున్ మిగిలారు. వీరిలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అలానే ఆదివారం ఎపిసోడ్‌లో చాలా అంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. అవేంటో ఓ లుక్కేసేయండి.

'కేజీఎఫ్' సినిమాలో మంచి ఎలివేషన్ సాంగ్‌తో నాగార్జున.. ఫినాలే ఎపిసోడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ సూట్‌లో రాయల్ లుక్‌లో కనిపించి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు.

ఇక ఫినాలే కోసం వచ్చిన ఈ సీజన్ మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ హిట్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేసి అదరగొట్టేశారు. అశ్విని-పూజా, శోభా-తేజ, గౌతమ్-శుభశ్రీ, సందీప్-నయని పావని స్టెప్పులతో అదరగొట్టారు. భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్‌బాస్ అని స్వయంగా కంపోజ్ చేసిన పాటకు భోలె డ్యాన్స్ చేసి ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేశాడు.

బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత 15 సినిమా ఆఫర్లు వచ్చాయని టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు. 9 వారాల్లో బిగ్‌బాస్ షోలో ఉండి ఎంత సంపాదించానో.. బయటకొచ్చిన తర్వాత 6 వారాల్లో అంతకంటే రెట్టింపు సంపాదించానని తేజ.. ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. తేజతో పాటు గౌతమ్, భోలె, శోభాశెట్టి తదితరులు.. బిగ్‌బాస్ నుంచి బయటకెళ్లినా తర్వాత తమ లైఫ్ చాలా బాగుందని అందరూ తమ అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు. 

ఇక ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్స్, హౌస్‌లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌తో హోస్ట్ నాగార్జున మాట్లాడిన తర్వాత.. ఇంట్లో ఉన్న ఆరుగురు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టేశారు. యావర్ జిమ్ సామాన్లతో, శివాజీ కాఫీ కప్పుతో, ప్రియాంక కిచెన్ సామాగ్రితో, మొక్కతో ప్రశాంత్, రాకెట్స్‌తో అర్జున్, కప్పుతో అమర్ డ్యాన్స్ చేశారు.

ఇక మొత్తం 19 మందికి సంబంధించిన బిగ్‌‌బాస్ జర్నీని వీడియోగా ప్లే చేసి అందరికీ చూపించారు. ఇది మొత్తం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగింది. ప్రతిఒక్కరూ తమని తాము స్క్రీన్‌పై చూసుకుని మురిసిపోయారు. ఇక చివర్లో ఎమోషనల్ కంటెంట్ చూసి తేజ.. గుక్కపట్టి ఏడ్చేశాడు. మా అందరిదీ చాలా బ్యూటీఫుల్ జర్నీ అని చెప్పుకొచ్చాడు.

ఇంట్లోని ఆరుగురు సభ్యులతో చిన్న ఫన్ టాస్క్ పెట్టిన నాగ్.. ఒక్కో కంటెస్టెంట్ మరొకరిలా యాక్ట్ చేసి మెప్పించారు. శివాజీ.. యావర్‌లా, అర్జున్.. శివాజీలా, యావర్.. అర్జున్‌లా, ప్రశాంత్.. ప్రియాంకలా, అమర్.. ప్రశాంత్‌లా, ప్రియాంక.. అమర్‌లా యాక్ట్ చేసి చూపించారు. 

హౌస్‌లో ఉన్న ఆరుగురిని బీబీ హౌస్‌లో మీ ఫేవరెట్‌ ప్లేస్‌ ఏంటి? అని నాగార్జున అడగ్గా.. ఒక్కొక్కరు తమకు నచ్చిన ప్లేస్‌ చెప్పారు. ప్రియాంక-స్టాండర్డ్ రూమ్, అర్జున్‌ - గార్డెన్‌ ఏరియా.. శివాజీ- యావర్‌-జోయకాలూస్‌ రూమ్‌, అమర్‌- గోడౌన్‌, ప్రశాంత్‌-గార్జెన్‌ ఏరియాలోని మొక్క అని చెప్పి..తమ బొమ్మలను ఆయా ప్లేసుల్లో పెట్టారు. 

అందాల తార నిధి అగర్వాల్‌ డాన్స్‌తో అదరగొటేటసింది. జవాన్‌ సినిమాలోని రామయ్య వస్తావయ్యా సాంగ్‌తో పాటు నాగార్జున సినిమాకు చెందిన పలు పాటలకు నిధి తనదైన స్టెప్పులేసి అలరించింది. 

టాప్-6లో ఉన్న ఆరుగురిలో నుంచి ఫినాలే ఎపిసోడ్‌లో అర్జున్ ఫస్ట్ ఎలిమినేషన్‌గా బయటకొచ్చాడు. ఇతడిని యాంకర్ సుమ.. హౌస్ నుంచి ఇతడిని బయటకు తీసుకొచ్చింది. 

దామిని బాగా కుక్ చేస్తుందనే ప్రశ్నకు యస్.. అశ్వినిని శోభా, ప్రియాంక తొక్కేశారు అన్న ప్రశ్నకు నో.. అర్జున్-అమర్ సంభాషణ ఒక్కోటి ఆణిముత్యం అన్న ప్రశ్నకు యస్.. శోభాపై పెట్టిన శ్రద్ధ, గేమ్ పై పెట్టుంటే తేజ టాప్-5లో ఉండేవాడనే ప్రశ్నకు యస్.. తదితర ప్రశ్నలకు అందరూ సమాధానాలు చెబుతూ ఫన్ జనరేట్ చేశారు. 

కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ అయిన తర్వాత నటి చంద్రిక రవి స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 'బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్' లాంటి పాటకు కేక పుట్టించే స్టెప్టులేసింది.

ఇకపోతే ఎక్స్-కంటెస్టెంట్స్‌ని పలు అవార్డులతో హోస్ట్ నాగార్జున సత్కరించాడు.

  • పిడకల అవార్డ్- దామిని
  • ఇన్‌స్టంట్ న్యూడిల్స్ అవార్డ్- నయని పావని
  • వాటర్ బాటిల్ అవార్డ్ - పూజామూర్తి
  • రెడ్ లిప్‌స్టిక్ అవార్డ్ - శుభశ్రీ
  • ఉడత అవార్డ్ - రతిక
  • సంచాలక్ ఆఫ్ సీజన్ అవార్డ్- సందీప్ మాస్టర్
  • గోల్డెన్ మైక్ అవార్డ్ - భోలె
  • టిష్యూ అవార్డ్ - అశ్విని
  • డంబెల్ అవార్డ్ - గౌతమ్
  • ఫైర్ బ్రాండ్ - శోభాశెట్టి

బేబీ సోనోగ్రఫీ ఫొటోని టీషర్ట్ పై వేసి, దాన్ని అర్జున్‌కి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది కాస్త స్పెషల్‌గా అనిపించింది.

ఇక 'ఈగిల్' సినిమా ప్రమోషన్‌లో భాగంగా స్టేజీపైకి వచ్చిన రవితేజ.. తన అభిమాని అయిన అమర్‌తో కాసేపు డ్రామా పండించాడు. తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బిగ్‌బాస్ సాక్షిగా హామీ ఇచ్చాడు. అయితే మూవీ ఛాన్స్ ఇస్తా, బయటకొచ్చేస్తావా? అని నాగ్ అడగ్గానే మరో ఆలోచన లేకుండా అమర్ బయటకొచ్చేస్తానని అన్నాడు. అమర్ ఇష్టం చూసి నాగ్-రవితేజ ఇద్దరూ అవాక్కయ్యారు. దీనిబట్టి చూస్తే రవితేజ రాబోయే సినిమాల్లో ఏదో ఒకదానిలో అమర్ యాక్ట్ చేయడం గ్యారంటీ.

ఫినాలేలో రెండో ఎలిమినేషన్ గా ప్రియాంక బయటకొచ్చింది. కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రవితేజ.. ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు.

'నా సామి రంగ' మూవీ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్.. రూ.15 లక్షల డబ్బుతో ఉన్న గోల్డెన్ సూట్‌కేస్‌తో బిగ్‌బాస్‌లోకి వచ్చారు. మిగిలిన నలుగురితో (అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్) చాలాసేపు డిస్కషన్ పెట్టారు. డబ్బులు తీసుకునేలా టెంప్ట్ చేశారు. చివరకు యావర్.. సూట్‌కేస్ తీసుకుని, తనకు తానుగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే యావర్.. సోదరులు కూడా చెప్పడంతో ఇక ఫైనల్‌గా సూట్ కేసు తీసుకుని బయటకొచ్చేశాడు.

'డెవిల్' మూవీ ప్రమోషన్‌లో భాగంగా షోకి వచ్చిన కల్యాణ్ రామ్, సంయుక్త మేనన్.. కాసేపు సినిమా గురించి చిట్‌చాట్ చేశారు. కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మిగిలిన ముగ్గురిలో శివాజీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే శివాజీ ఎలిమినేట్ కావడాన్ని ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. కాళ్లు పట్టేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

ఇక టాప్-2లో మిగిలిన అమర్, ప్రశాంత్ కోసం హౌసులోకి వెళ్లొచ్చిన హోస్ట్ నాగార్జున.. వీళ్లిద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చారు. అయితే విజేత  ఎవరనేది ప్రకటించడానికి ముందు బిగ్‌బాస్ చిన్న సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. నాగార్జున జర్నీని వీడియోగా ప్లే చేసి కాస్త ఫన్ జనరేట్ చేశాడు.

చివరి వరకు సస్పెన్స్ మెంటైన్ చేస్తూ వచ్చిన బిగ్‌బాస్ హౌస్ట్ నాగార్జున.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‪‌ని విజేతగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయిన ప్రశాంత్.. అలా షాక్‌లో ఉండిపోయాడు. ఇకపోతే అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు.

బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కి రూ.35 లక్షల చెక్‌‌తో పాటు మారుతీ సుజుకీ బ్రెజా, రూ.1‍5 లక్షల విలువైన జ్యూవెల్లరీ నెక్లెస్ సెట్‌ని కూడా బహుమతిగా అందించారు. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చిన రైతుల కోసమే ఆడాను. కారు నాన్నకు, నెక్లెస్‌ అమ్మకు బహుమతిగా ఇస్తాను అంటూ స్పీచ్‌తో అదరగొట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement