సైకోలా మారిన అమర్‌దీప్.. టైటిల్‌ రేసులో నుంచి అవుట్‌.. | Bigg Boss 7 Telugu: Amardeep Worst Behavior on Pallavi Prashanth | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: ప్రశాంత్‌కు తన చేతులతో టైటిల్‌ అప్పగించేసిన అమర్‌! రైతుబిడ్డ అంటే అంత చులకనా..?

Published Fri, Dec 8 2023 7:08 PM | Last Updated on Mon, Dec 11 2023 12:26 PM

Bigg Boss 7 Telugu: Amardeep Worst Behavior on Pallavi Prashanth - Sakshi

ఎంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కట్లేదు.. చేతి దాకా వచ్చింది నోటి దాకా రావట్లేదు.. అదృష్టం కలిసి రావట్లేదు.. అంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు అమర్‌దీప్‌. ఈ నెగెటివ్‌ ఫీలింగ్‌ పోగొట్టడానికి బిగ్‌బాస్‌, నాగార్జున సైతం గత వారం అమర్‌ ఆటతీరు అద్భుతంగా ఉందని, అందుకు బహుమతిగా కెప్టెన్సీని అనుభవించమని బంపరాఫర్‌ ఇచ్చాడు. కానీ అమర్‌ ఏం చేస్తున్నాడు? హౌస్‌మేట్స్‌తో సరిగా పనులు చేయించుకోలేకపోతున్నాడు. కొందరికి ఎక్కువ పనులు, కొందరికి తక్కువ పనులు అప్పజెబుతుండటంతో ఇంటిసభ్యులు అమర్‌ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కెప్టెన్సీ బ్యాడ్జ్‌తో మొదలైంది..
అటు నామినేషన్స్‌లోనూ నేను కెప్టెన్‌ను చెప్తున్నా.. కూర్చో అని కాస్త రూడ్‌గా మాట్లాడాడు. ఇక ఎప్పుడైతే అమర్‌ కెప్టెన్సీ బ్యాడ్జ్‌ పెట్టుకున్నాడో.. అ‍ప్పుడే అతడికి బ్యాడ్‌ టైం స్టార్ట్‌ అయింది. వరుస కొట్లాటలు.. గొడవలు.. ఆఖరికి స్నేహితుల మధ్య కూడా పొరపచ్చాలు. అంతకుముందు వరకు సరదాగా ఉండే అమర్‌ ఈ వారం మాత్రం కంట్రోల్‌ తప్పిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు గొడవపడుతున్నాడు? అన్న స్పృహ కూడా లేకుండా పోయింది. చేతులారా తన ఆటను తానే చెడగొట్టుకుంటున్నాడు. మొన్నటి వరకు విన్నర్‌ రేసులో ఉన్న అతడి గ్రాఫ్‌ నిన్నటి ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయింది.

కొడుతూ, తిడుతూ, కొరికేస్తూ.. ఏంటీ అరాచకం?
నిజానికి ఏ సీజన్‌లో అయినా అప్పటిదాకా కొట్టుకున్న కంటెస్టెంట్లు కూడా ఫినాలే దగ్గరపడగానే అంతా మర్చిపోయి కలిసిపోతారు. కానీ ఈ సీజన్‌లో మాత్రం గొడవలు ముదురుతున్నాయే తప్ప చల్లారడం లేదు. నిన్నటి ఎపిసోడ్‌లో అయితే అమర్‌దీప్‌ రైతుబిడ్డ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. అతడిని తిడుతూ, కొడుతూ.. ఒరేయ్‌ అని పిలుస్తూ సైకోలా మారిపోయాడు. చెప్పుతో కొడతానంటూ సంజ్ఞ చేశాడు. పైగా కోపంతో ప్రశాంత్‌ను పంటితో కొరికేశాడు. ఇలా కొరుకుతున్నావేంటన్నా అని ప్రశాంత్‌ అడిగిన పాపానికి అతడిని మెడికల్‌ రూమ్‌కు తోసుకుంటూ, నెట్టేస్తూ, లాక్కెళ్తూ హీనంగా ప్రవర్తించాడు.

ఎందుకంత చులకన?
తోయకు అన్నా.. వద్దన్నా.. అని ప్రశాంత్‌ ఎంత అర్థిస్తున్నా వినకుండా అతడి మీద చేయి చేసుకుంటూ, చులకనతో నెట్టేస్తూ అతి చేశాడు. ఇది చూసిన జనాలు అమర్‌ను ఏకిపారేస్తున్నారు. 'అమర్‌కు ప్రశాంత్‌ అంటే ఎందుకంత చులకనభావం?', 'ఒక వ్యక్తి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా?', 'ఇలాంటి వ్యక్తికి నాగార్జున రెడ్‌ కార్డ్‌ చూపించి ఎలిమినేట్‌ చేయాలి' అని ఆగ్రహిస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్‌తో అమర్‌ గెలుపు దాదాపు దూరమైనట్లే! ప్రశాంత్‌ విజయానికి మరో అడుగు ముందుకు పడినట్లే!

చదవండి: అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌ గలీజ్‌ మాటలు.. కాళ్లు మొక్కుతానంటూ కీర్తి ఎమోషనల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement