సీక్రెట్‌ టాస్క్‌లో ఫెయిల్‌... జైలుకు వెళ్లిన శివాజీ! | Bigg Boss 7 Telugu: Sivaji Failed In Secret Task | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: ఇద్దరిని హత్య చేసిన శివాజీ.. జైల్లో వేసిన బిగ్‌బాస్‌!

Published Wed, Nov 22 2023 12:00 PM | Last Updated on Wed, Nov 22 2023 12:20 PM

Bigg Boss 7 Telugu: Sivaji Failed In Secret Task - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఓ సరదా, సీరియస్‌  టాస్క్‌ జరుగుతోంది. బిగ్‌బాస్‌ భార్య వండిన బిర్యానీని హౌస్‌మేట్స్‌ ఆవురావురుమని ఆరగించారు. కరువులో కొట్టుమిట్టాడుతున్నట్లుగా మెతుకు మిగల్చకుండా ప్లేటు ఖాళీ చేశారు. ఇంతలో బిగ్‌బాస్‌ ఓ విషాద వార్త మోసుకొచ్చాడు. తన భార్యను చంపేసి ఆమె దగ్గరున్న నెక్లెస్‌ ఎత్తుకెళ్లారని, ఆ హంతకుడిని కనిపెట్టాలని కోరాడు.

ఈ క్రమంలో అమర్‌, అర్జున్‌ పోలీసులుగా అవతారం ఎత్తగా అశ్విని, శోభా రిపోర్టర్లుగా మారారు. ఇలా ఒక్కో కంటెస్టెంట్‌కు ఒక్కో రోల్‌ అప్పగించాడు. ఓపక్క హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే మరోపక్క కంటెస్టెంట్లకు క్రమానుసారంగా సీక్రెట్‌ టాస్కులు ఇస్తున్నాడు బిగ్‌బాస్‌. ఈ క్రమంలో శివాజీకి ఎవరికీ అనుమానం రాకుండా పల్లవి ప్రశాంత్‌, అశ్వినిని చంపాలని సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. 

ఆ ఇద్దరినీ చంపాడు కానీ హౌస్‌మేట్స్‌ శివాజీయే చంపాడని పసిగట్టారు. దీంతో శివాజీని టాస్క్‌లో ఫెయిలైనట్లుగా తెలిపిన బిగ్‌బాస్‌ అతడిని జైల్లో వేసినట్లు తెలుస్తోంది. ఒక్క టాస్క్‌ అయినా సరిగా ఆడని శివాజీ పక్కవాళ్ల ఆటలకు మాత్రం వెయ్యి వంకలు పెడుతాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ కూడా సరిగా నిర్వర్తించలేక మరోసారి తన అసమర్థతను నిరూపించుకున్నాడు.

చదవండి: పేరు కూడా అడగలేదు, గదిలోకి రమ్మని పిలిచాడు.. రోజూ తాగి వచ్చి టార్చర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement