ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న రైతుబిడ్డ.. ఆమెని దెబ్బకొట్టడం గ్యారంటీ!? | Pallavi Prashanth Won Bigg Boss 7 Eviction Pass Rathika Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌తో గొడవపడి తప్పు చేసింది.. లేకపోయింటే!

Published Tue, Nov 21 2023 6:34 PM | Last Updated on Tue, Nov 21 2023 6:45 PM

Pallavi Prashanth Won Bigg Boss 7 Eviction Pass Rathika Elimination - Sakshi

బిగ్‌బాస్ షోలో ఆడుతున్న రైతుబిడ్డ ప్రశాంత్ మరో సూపర్ పవర్ సాధించాడు. శివాజీ గ్యాంగులో ఉన్నప్పటికీ ప్రతిసారి తనదైన మార్క్ చూపిస్తున్న ప్రశాంత్.. ఈసారి కీలకమైన పోటీలో గెలిచాడు. కాకపోతే ఇతడు గెలవడం ఓ లేడీ కంటెస్టెంట్‌కి శాపమయ్యేలా ఉంది. ఇంతకీ అసలేం జరిగింది? డేంజర్ జోన్‌లో ఉన్న ఆమె ఎవరు?

ప్రస్తుతం బిగ్‌బాస్ హౌసులో 12వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. సోమవారం సగం నామినేషన్స్ పూర్తి కాగా, మంగళవారం మిగిలిన సగం ప్రసారం కానుంది. అయితే ఈ వారం కెప్టెన్ ప్రియాంక, శోభాశెట్టి తప్పితే మిగిలిన వాళ్లందరూ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అలానే గతవారం యావర్, తను గెలుచుకున్న ఎవిక్షన్ పాస్ తిరిగిచ్చేశాడు. దీంతో సదరు పాస్ కోసం ఈ వారం మళ్లీ పోటీ పెట్టారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)

ఎవిక్షన్ పాస్ కోసం ప్లేట్లు, గ్లాసుల్ని బ్యాలెన్సింగ్ చేసే టాస్క్ పెట్టగా ఇందులో పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు గానీ న్యూస్ అయితే బయటకొచ్చేసింది. అయితే ఈ పాస్‌ని ప్రశాంత్.. ఎప్పుడు ఉపయోగించాలనేది అతడి ఇష్టం. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఉపయోగించమని బిగ్ బాస్ చెప్పాడే అనుకుందాం. ప్రశాంత్ కి ఓట్లు పడతాయి కాబట్టి తన గురించి తాను ఉపయోగించకపోవచ్చు.

ఎలిమినేషన్స్‌లో ఉన్న మిగతా వాళ్ల కోసం అంటే యావర్, శివాజీకి ఓట్లు పడతాయి కాబట్టి వాళ్లు సేవ్ అయిపోతారు. తనని నామినేట్ చేసిన గౌతమ్, గతవారం నామినేట్ చేసిన అర్జున్ కోసం దీన్ని ప్రశాంత్ ఉపయోగించకపోవచ్చు. ఎటొచ్చి మొన్నటివరకు ప్రశాంత్‌తో మంచిగా ఉన్న రతిక.. ఈసారి అతడిని నామినేట్ చేసి పడేసింది. కాబట్టి రతిక బదులు అశ్వినిని ప్రశాంత్ సేవ్ చేయొచ్చు. ఒకవేళ గొడవ పడకుండా, నామినేట్ చేయకుండా ఉంటే రతికని ప్రశాంత్ సేవ్ చేసి ఉండేవాడేమో? ఎందుకో ఈసారి రతిక ఎలిమినేట్ కావడం గ్యారంటీ అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఒక్కరోజు గ్యాప్‌లో రిలీజ్ రెండు హిట్ మూవీస్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement