
బిగ్ బాస్ హౌసులోకి కొత్తగా ఐదుగురు వచ్చారు. దీంతో కాస్త జోష్ వచ్చింది. ఇప్పుడు అదే ఊపు కొనసాగిస్తూ అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరోవైపు రైతుబిడ్డ ప్రశాంత్ కెప్టెన్సీని బిగ్ బాస్ పీకి పడేశాడు. అలానే అమరదీప్ ఎలిమినేషన్ భయం నుంచి కాస్త బయటకొచ్చాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్‌లో ఏమేం జరిగిందనేది Day 38 హైలైట్స్‌లో చూద్దాం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)
అమర్‌కి మోటివేషన్
ఆటగాళ్లు vs పోటుగాళ్లు మధ్య కెప్టెన్సీ కోసం పోటీ నడుస్తోంది. మంగళవారం గేమ్స్ సగంలోనే ఆగిపోయాయి. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ఇక పోటీల్లో సరిగా ఫెర్ఫార్మ్ చేయలేదని అమరదీప్ డల్ అయిపోయాడు. దీంతో యవర్ అతడికి మోటివేషన్ చేశాడు. రాత్రి నిద్రపోయే టైంలో అమరదీప్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రియాంక, సందీప్ వచ్చి అతడిని సముదాయించారు.
రైతుబిడ్డ కెప్టెన్సీ పాయే
ప్రశాంత్ కెప్టెన్ అయితే అయ్యాడు గానీ పెద్దగా మెరుపుల్లేవు. దీంతో బిగ్ బాస్ అతడి కెప్టెన్సీని డైరెక్ట్‌గా రద్దు చేయొచ్చు గానీ అలా చేయలేదు. మిగతా హౌస్‌మేట్స్‌ని అసలు కెప్టెన్ అంటే ఏంటని అడిగితే.. వర్క్ డివైడ్ చేయాలి, లీడర్‌షిప్ క్వాలిటీ అని అతడికి వ్యతిరేకంగా చెప్పారు. తీరా ప్రశాంత్ మంచి కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు? అని అడిగితే శోభా, సందీప్, తేజ తప్ప అందరూ చేతులెత్తేశారు. అయినా సరే బిగ్‌బాస్ కనికరించలేదు.
(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత?)
యవర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా, తేజ నిద్రపోతున్నా, ఇంట్లో రేషన్ అయిపోతున్నా ఏం చేశావంటూ కెప్టెన్సీ పీకిపడేశాడు. ఇక కెప్టెన్సీ నుంచి తీసిపడేసరికి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కెప్టెన్సీ ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడేమో ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. ఇలాంటి టైంలో మరోచోట కూర్చుని మాట్లాడిన శివాజీ.. వాడికి(ప్రశాంత్) ఏడవడం తప్ప ఇంకేం రాదని అన్నాడు.
విజేతగా పోటుగాళ్లు
మంగళవారం ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కోసం రెండు గేమ్స్ పెట్టిన బిగ్ బాస్.. బుధవారం మిగిలిన రెండు గేమ్స్ పెట్టాడు. 'హౌ ఈజ్ ఫాస్టెస్ట్' గేమ్‌లో భాగంగా బిగ్ బాస్ చెప్పిన రంగు ఉన్న ఏదైనా వస్తువుని తీసుకొచ్చి లాన్ లోని మార్క్ చేసిన ప్లేసులో వేయాలి. ఇందులో ఆటగాళ్లు గెలిచారు. 'హౌ ఈజ్ స్ట్రాంగెస్ట్' అని పెట్టిన ఇంకో పోటీలో పోటుగాళ్లు గెలిచారు. అలా నాలుగింటిలో మూడు గెలిచిన పోటుగాళ్లు.. కెప్టెన్సీ పోటీలో నిలిచారు. అలా బుధవారం ఎపిసోడ్ పూర్తయింది.
(ఇదీ చదవండి: గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు!)
Comments
Please login to add a commentAdd a comment