బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ సూపర్ హిట్టయింది. ఈ సీజన్‌లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా అవతరించాడు. ఇతడి గెలుపుకు సింపతీ కూడా ఓ కారణమే! మొదటి నుంచి అతడిని రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ ఆకాశానికెత్తారు. జనాలు సైతం తమలో ఒకడు ప్రశాంత్ అంటూ అతడికి బాగా కనెక్ట్ అయ్యారు. నిన్న(డిసెంబర్ 17న) అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలేలో అమర్‌దీప్‌ను ఓడిస్తూ విజేతగా అవతరించాడు ప్రశాంత్. ఇక షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్లు తమ ఇంటికి తిరుగుపమయనమయ్యారు.
స్టూడియో వెలుపల గందరగోళం
వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అమర్‌దీప్.. తన భార్య, తల్లితో కారులో బయటకు రాగానే ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారును చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టారు. అలాగే కొన్ని అల్లరి మూకలు గీతూ రాయల్, అశ్విని శ్రీ కారు అద్దాలు సైతం ధ్వంసం చేశారు. అటువైపుగా వెళ్తున్న బస్సు అద్దాలపైనా రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం కోసం కంటెస్టెంట్లను అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు.
వెళ్లిపోమన్నందుకు పోలీసులపై అసహనం
ప్రశాంత్ రూఫ్ టాప్ ద్వారా కారులో నుంచి బయటకు వస్తే శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన పోలీసులు అతడిని బయటకు రావొద్దని చెప్పారు. అలాగే కారు కూడా ఆపకుండా ముందుకు పోనివ్వాలని హెచ్చరించారు. దీంతో ప్రశాంత్ అసహనానికి లోనయ్యాడు. 'అన్నా.. ఏందన్నా ఇది! ఒక రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు' అని ఆగ్రహించాడు. 'పోలీసులే ఇట్ల చేస్తే ఎలా అన్నా? ఒక రైతుబిడ్డ అన్నా.. నా కోసం ఎంతమంది వచ్చిర్రన్నా..' అంటూ ఆగ్రహించాడు.
పోలీసులను వీడియో తీయ్.. అంటూ ఆర్డర్స్
తనను బయటకు రానివ్వట్లేదని తల బాదుకుంటూ.. పోలీసులను వీడియో తీయమని కారులో ఉన్నవారికి ఆదేశాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. 'ఈ రైతుబిడ్డ అనే సింపతీతో సీజనే గెలిచేశావ్.. దాన్ని ఇంకా వదిలిపెట్టవా' అని కామెంట్లు చేస్తున్నారు. 'శాంతి భద్రతల కోసం పోలీసులు వెళ్లిపోమంటే అది కూడా తలకెక్కడం లేదా?' అని ప్రశ్నిస్తున్నారు.
Veedu winner entra karma kakapothe🥴🤦🏻♂️
— ✯ (@sagatuXuser) December 17, 2023
Law n order issue ani cheptunte, oka raithu bidda ki viluva isthaleru antunadu💀🤧#BiggBossTelugu7pic.twitter.com/ooDetkYlK6
చదవండి: బిగ్‌బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం..
Comments
Please login to add a commentAdd a comment