బిగ్‌బాస్ 7 పూర్తయిపోవడానికి ఇంకొన్ని గంటలే ఉంది. మొన్నటివరకు జర్నీ వీడియోలతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసిన నిర్వహకులు.. ఇప్పుడు ఏం చేయాలో తెలీక టైమ్ పాస్ చేస్తున్నారు. అందరూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. శివాజీ మాత్రం అతి బద్ధకంతో చిరాకు తెప్పిస్తున్నాడు. రైతుబిడ్డ అమర్‌కి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 103 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
శివాజీ అలాంటి భాష
ఆరుగురు ఇంటిసభ్యులు నిద్రలేవడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే అమర్.. మిగిలిన ఐదుగురి జాతకం చెప్పాలని చెప్పి ఓ టాస్క్ ఇచ్చాడు. ఉన్నంతలో మనోడు బాగానే ఎంటర్‌టైన్ చేయాలని చూశాడు. కానీ మధ్యలో శివాజీ దూరి.. వెధవ-వెధవ అనే పదేపదే అడ్డుతగిలి చిరాకు తెప్పించాడు. టాస్క్ సరిగా పూర్తి చేయనీకుండా తలనొప్పి తీసుకొచ్చాడు. ఇక ఉన్న ఆరుగురూ మరీ బద్ధకంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయిన బిగ్‌బాస్.. విన్నర్‌గా నిలిచేవారు చివరివరకు వచ్చి ఆగిపోరు అని అలెర్ట్‌గా ఉండాలని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో చెప్పండి చూద్దాం?)
యావర్ సేఫ్ గేమ్
ఇక గురువారం ఎపిసోడ్‌లో భాగంగా అర్జున్, శివాజీ, అమర్.. ఇంట్లో వాళ్లు పంపిన ఫుడ్‌ని ఆస్వాదించారు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో ప్రియాంక, ప్రశాంత్, యావర్ కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. అయితే వీళ్లకి ఫుడ్ దక్కుతుందా లేదా అనేది అర్జున్, అమర్, శివాజీ చేతుల్లో ఉంటుందని బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్ల ముగ్గురికి గేమ్స్ పెట్టి, అందులో గెలిచిన వాళ్లు ఫుడ్ ఎవరికి రావాలో డిసైడ్ చేస్తారని బిగ్‌బాస్ చెప్పాడు. తొలి గేమ్‌లో గెలిచిన అమర్.. యావర్ పేరు చెప్పాడు. అయితే ఇంటి ఫుడ్ మరో సభ్యుడితో పంచుకోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా.. ఎవరి పేరు చెప్పినా మరొకరు ఫీల్ అవుతారని నాకు ఫుడ్ వద్దని చెప్పేశాడు.
శివాజీ బద్ధకం
ఇక కప్పులు బ్యాలెన్స్ చేసే రెండో గేమ్‌లో అర్జున్ గెలిచాడు. ప్రశాంత్ పేరు చెప్పాడు. అయితే ప్రశాంత్ నువ్వు ఎవరితో ఫుడ్ పంచుకుంటావ్? అని బిగ్‌బాస్ అడగ్గా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఈ రోజు అమర్ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంత్ ఇతడి పేరు చెప్పాడు. వీళ్లిద్దరూ ప్రశాంత్ అమ్మ చేసి పంపిన మటన్ కర్రీ, బగారా రైస్ తిన్నారు. ఇకపోతే రెండు గేమ్స్‌లోనూ శివాజీ మరీ బద్ధకం ఆడి.. ఒక్క గేమ్‌లోనూ గెలవలేకపోయాడు. ఇలాంటోడిని గనుక బిగ్‌బాస్ పొరపాటున విజేతని చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు! మరోవైపు తనదగ్గరున్న పాయింట్స్ ఉపయోగించుకున్న అమర్.. తన భార్య తేజస్వితో బిగ్‌బాస్ హౌస్ నుంచి లైవ్ వీడియో కాల్ మాట్లాడాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది.
(ఇదీ చదవండి: 'సలార్' మూవీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన ప్రభాస్..)
Comments
Please login to add a commentAdd a comment