'బిగ్‌బాస్' ఆడుకున్నాడు.. వాళ్లని నిద్ర పోనీయకుండా చేశాడు! | Bigg Boss 7 Telugu Day 10 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 10 Highlights: పాపం.. నిద్ర మానుకుని తెగ కష్టపడ్డారు కానీ!

Published Wed, Sep 13 2023 10:44 PM | Last Updated on Thu, Sep 14 2023 9:30 AM

Bigg Boss 7 Telugu Day 10 Episode Highlights - Sakshi

'బిగ్‌బాస్' రెండో వారం నామినేషన్స్ హడావుడి సైడ్ అయిపోయింది. ఒకరిని ఒకరు కొట్టుకుంటారా అనేంతలా గొడవపడ్డ కంటెస్టెంట్స్ కాస్త.. ఇప్పుడు దాని గురించే మర్చిపోయారా అనిపిస్తుంది. ఎందుకంటే 'మాయ అస్త్ర' అని 'బిగ్‌బాస్' ఓ పోటీ పెట్టారు. మంగళవారం సగం ఆట కాగా, బుధవారం మిగతాది పూర్తి చేశారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ అందరూ పిల్లిమొగ్గలు వేశారు. ఓవరాల్‌గా ఏం జరిగిందనేది Day-10 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

దొంగతనం ప్లాన్
'మాయ అస్త్ర' టాస్కులో భాగంగా మంగళవారం పెట్టిన 'పుల్ రాజా పుల్' గేమ్‌లో రణధీర సమూహం (శివాజీ, అమర్‌దీప్, ప్రిన్స్, ప్రియాంక, శోభాశెట్టి, షకీలా) గెలిచారు. దీంతో వీళ్లకి ఓ తాళం చెవిని 'బిగ్‌బాస్' ఇచ్చాడు. అక్కడితో మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. దాన్ని దొంగతనం చేయాలని మహాబలి టీమ్ ప్లాన్ వేయడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. తాళం సంపాదించమని చెప్పారు గానీ దొంగతనం చేయొద్దని చెప్పలేదుగా అని తేజ తొలుత డౌట్ పడ్డాడు. దీంతో తాళం చెవి కొట్టేద్దామని గౌతమ్ అన్నాడు. 

(ఇదీ చదవండి: అతిపెద్ద సినిమా స్క్రీన్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ పోద్ది!)

తాళం కోసం తిప్పలు
అప్పటికే రాత్రి అయిపోవడంతో అందరూ నిద్రపోవడానికి ఉపక్రమించారు. మహాబలి (రతిక, శుభశ్రీ, గౌతమ్, తేజ, దామిని, ప్రశాంత్) మాత్రం.. రణధీర గ్రూప్ దగ్గరున్న తాళాన్ని ఎలాగైనా కొట్టేయాలని రాత్రంతా నిద్రపోకుండా తెగ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నిద్రపోయినట్లు నటిస్తున్న శుభశ్రీ దగ్గరకొచ్చిన శివాజీ.. 'ఏం యాక్టింగ్ చేస్తున్నావ్' అని అన్నాడు. ఇది జరిగిన తర్వాత దామిని-రతిక-శుభశ్రీ రాత్రంతా తాళం కోసం జాగరం చేశారు.

తాళం కోసం మరో గేమ్
ఇప్పుడు 'బిగ్‌బాస్' మలుపులో గెలుపు అని రెండు గ్రూపులకు మధ్య మరో గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా సంచాలకుడు సందీప్ ఓ చక్రంలో ఉన్న పుల్లని తిప్పుతాడు. అది ఏ రంగు అయితే వచ్చి ఆగుతుందో.. పోటీపడే కంటెస్టెంట్స్.. తమ ఎదురుగా బల్లపై ఉన్న సర్కిల్స్‌లో ఆ కలర్‌పై చేతులు లేదా కాలు పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైతే ముందు తప్పు చేస్తారో వాళ్లు ఓడినట్లు. తొలుత గౌతమ్‌పై ప్రియాంక విజయం సాధించింది. ఆ తర్వాత శోభాపై ప్రశాంత్, రతికపై ప్రిన్స్ గెలిచారు. అలా తొలి గేమ్‌లో విజయం సాధించిన రణధీర్ టీమ్.. మళ్లీ రెండు పాయింట్లతో ఈ పోటీలోనూ గెలిచింది.

(ఇదీ చదవండి: గ్లామర్ డోస్ పెంచిన నిహారిక... తమన్నా ముద్దులే ముద్దులు)

పవర్ అస్త్ర కొట్టేశారు
ఇక తాళాలు దొంగిలించలేకపోయిన మహాబలి టీమ్ సభ‍్యులు.. సందీప్ గెలుచుకున్న 'పవర్ అస్త్ర' దొంగిలించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ చిన్న చమక్కు విసిరిన దాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. మరోవైపు తెలుగు కాకుండా హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నందుకు ప్రిన్స్‌కు 'బిగ్‌బాస్' పనిష్మెంట్ ఇచ్చాడు. లాన్ ఏరియాలో 'ఇంట్లో ఉన్నంతకాలం తెలుగులోనే మాట్లాడుతాను' అనే పేరా మళ్లీమళ్లీ చాలాసేపు చదువుతూనే ఉన్నాడు. చదువుతుంటే ప్రిన్స్ దగ్గరే తాళం ఉందనే విషయం తెలిసి, అతడిని మహాబలి టీమ్ తెగ ఇబ్బంది పెట్టారు.

'మాయ అస్త్ర' సొంతం
ఇక పెట్టిన రెండు పోటీల్లోనూ విజేతలుగా నిలిచిన రణధీర్ సమూహానికి బిగ్‍‌బాస్ 'మాయ అస్త్ర' ఇచ్చాడు. అందులో ఆరు భాగాల్ని గ్రూపులో ఉన్న ఆరుగురు పంచుకున్నారు. వీళ్లందరూ కూడా 'పవర్ అస్త్ర' పోటీలో ఉంటారని బిగ్‌బాస్ గుర్తు చేశాడు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. మరి గురువారం ఏ టాస్క్ ఇస్తాడో ఎలా ఉండబోతుందనేది చూడాలి.

(ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement