Bigg Boss 7: యావర్ ఏడ్చేశాడు.. ప్రశాంత్ ఏడిపించేశాడు! | Bigg Boss 7 Telugu Day 101 Epsiode Highlights | Sakshi

Bigg Boss 7 Day 101 Highlights: ట్రూ ఎమోషన్స్ బయటపడ్డాయి.. ది బెస్ట్ జర్నీ వీడియోస్!

Dec 13 2023 11:03 PM | Updated on Dec 14 2023 9:11 AM

Bigg Boss 7 Telugu Day 101 Epsiode Highlights - Sakshi

బిగ్‌బాస్ షో చివరకొచ్చేసింది. దీంతో హౌస్ అంతా కూడా ఫుల్ పాజిటివ్ వైబ్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే అమర్, అర్జున్, శివాజీ, ప్రియాంక.. తమ జర్నీ వీడియోలు చూసేసుకున్నారు. తాజా ఎపిసోడ్‌లో భాగంగా చివరగా మిగిలిన యావర్, ప్రశాంత్.. తమ జర్నీ వీడియోస్ చూసి తెగ మురిసిపోయారు. ఇంతకీ బుధవారం ఏం జరిగిందనేది Day 101 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: Bigg Boss: వింత టాస్క్.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యంగ్ హీరోయిన్!)

యావర్‌కి కేజీఎఫ్ ఎలివేషన్స్
ఫైనల్-6లో ఒకడైన యావర్.. తన బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకోవడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫొటలన్నీ చూస్తూ ఎమోషనల్ అయిపోయిన యావర్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక యాక్టివిటీ రూంలో స్క్రీన్‌పై ప్లే చేసిన దాదాపు 17 నిమిషాల వీడియో చూస్తే అన్ని రకాల భావోద్వేగాలు పలికించాడు. యావర్ కోసం బిగ్‌బాస్.. కేజీఎఫ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ వాడేశాడు. వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. 'నాకు కోపం ఉందని అందరూ అంటారు, కానీ నాలో చరిత్ర సృష్టించే అంతా దమ్ముంది' అని యావర్.. తన ఫీలింగ్ బయటపెట్టాడు.

 

మురిసిపోయిన రైతుబిడ్డ ప్రశాంత్ 
యావర్ తర్వాత ప్రశాంత్ వంతు. బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకున్న ప్రశాంత్.. తన తండ్రితో ఉన్న ఫొటో చూసి తెగ ఎమోషనల్ అయిపోయాడు. అనంతరం యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రశాంత్.. తన జర్నీని స్క్రీన్‌పై చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఇక మొదటి నుంచి కేవలం ప్రశాంత్ అని పిలుస్తూ వచ్చిన బిగ్‪‌బాస్.. ఫస్ట్ టైమ్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అని పిలిచాడు. దీంతో మనోడు ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఓవైపు నవ్వుతూ, మరోవైపు ఏడుస్తూ.. ఆనంద భాష్పలతో షర్ట్ అంతా తడిపేశాడని చెప్పొచ్చు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement