Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి! | Bigg Boss Telugu 7 Latest Promo Pallavi Prashanth Father Video - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Pallavi Prashanth: ఏడుస్తూ ఆ విషయం చెప్పిన పల్లవి ప్రశాంత్ తండ్రి!

Published Fri, Nov 10 2023 4:38 PM | Last Updated on Fri, Nov 10 2023 4:48 PM

Bigg Boss 7 Latest Promo Pallavi Prashanth Father Video - Sakshi

బిగ్‌బాస్ హౌస్ ఎందుకో ఏడిపించేస్తోంది. ప్రతిసారీ ఉన్నట్లే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. అయితే హౌసులోకి వస్తున్న ప్రతిఒక్కరూ అక్కడ ఉన్నవాళ్లతో పాటు చూస్తున్న మనల్ని కూడా ఏడిపించేస్తున్నారు భయ్యా! తాజాగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తండ్రి హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. కొడుకుకి ధైర్యం చెబుతూనే ఓ బ్యాడ్ న్యూస్ కూడా చెప్పారు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది?

ప్రతిసారి కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరో ఒకరు వస్తుంటారు. కాకపోతే పెద్దగా గుర్తింపు తెచ్చుకోరు. రైతుబిడ్డ ట్యాగ్‌తో బిగ్‍‌బాస్ 7లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. శివాజీ కూడా ఉండటం తప్పితే గేమ్ పరంగా ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఫ్యామిలీ వీక్ సందర్భంగా అందరూ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వస్తున్నారు. అలా పల్లవి ప్రశాంత్ తండ్రి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!)

పొలంలో పండిన బంతిపూలని తీసుకొచ్చిన ఆయనని చూసి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇక అమరదీప్‌తో మాట్లాడుతూ.. గొడవలు పడకండి బిడ్డా, మంచిగా కలిసి ఉండండి అని ప్రశాంత్ తండ్రి చెప్పారు. అలానే తండ్రిని ఎత్తుకుని ప్రశాంత్ తిప్పాడు. ఇద్దరూ కలిసి తగ్గేదే లే అనే డైలాగ్ కూడా చెప్పారు. తండ్రి అన్నం కూడా కలిపి తినిపించాడు. ఇదంతా అయిన తర్వాత కొడుకుతో మాట్లాడిన ఆయన.. 'టాలెంట్ ఉంది ఉపయోగించుకో, నేను ఏం చెప్పినా నువ్వు ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తుంది, ఆమెకు బీపీ కూడా పెరుగుతుంది' అని అన్నాడు.

దాదాపు రెండు నెలల నుంచి కొడుక్కి దూరంగా ఉండటం వల్ల ప్రశాంత్ తల్లి తట్టుకోలేకపోతుంది. బహుశా అందుకో కాస్త అనారోగ్యానికి గురైనట్లు ప్రశాంత్ తండ్రి మాటల బట్టి తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోనే ఇంతలా ఎమోషనల్ చేసింది. ఇక ఫుల్ ఎపిసోడ్‍‌లో ఇంకా ఏమేం ఉండబోతుందో?

(ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్‌’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement