బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్‌లు అంటే కాస్త కఠినంగానే ఉంటాయి. గెలవడం కోసం కంటెస్టెంట్స్ ఏమైనా చేస్తారు. బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో ప్రారంభం నుంచే కాస్త కఠనమైన టాస్కులు ఇస్తున్నారు నిర్వహాకులు. తాజాగా పవరాస్త్ర గెలవడం కోసం ఇచ్చిన టాస్కులో పల్లవి ప్రశాంత్ గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయ కావడంతో కుప్పకూలిపోయినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు.
నాలుగో పవరాస్త్ర కోసం పోటీ
బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తం 14 మంది పాల్గొన్నారు. అయితే వారంతా పోటీదారులు మాత్రమే. ఇంటి సభ్యులు కావాలంటే బిగ్‌బాస్ పెట్టిన టాస్కులు గెలవాల్సిందే. పవరాస్త్ర గెలిస్తే..కొన్ని సదుపాయాలు ఉంటాయి. అందుకే పవరాస్త్ర కోసం కంటెస్టెంట్స్ పోటీపడి మరి గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికే సందీప్, శివాజీ, శోభా శెట్టి పవరాస్త్ర గెలిచారు. ఇక నాలుగో పవరాస్త్ర కోసం ఈ వారం పోటీపడుతున్నారు.
బ్యాంకుగా మారిన బిగ్‌బాస్ హౌస్
నాలుగు పవరాస్త్ర కంటెంటర్‌ని సెలెక్ట్ చేయడం కోసం బిగ్‌బాస్ హౌస్‌ని బ్యాంకుగా మార్చారు. బ్యాంకర్స్‌గా శివాజీ, సందీప్,శోభా శెట్టి వ్యవహరిస్తారని బిగ్‌బాస్ చెప్పాడు. మిగతవారు బీబీ కాయిన్స్ సేకరించాల్సి ఉంటుంది. ఆట ముగినే సరికి ఎవరి దగ్గర ఎక్కువ బీబీ కాయిన్స్ ఉంటే వారు నాలుగో పవరాస్త్ర కంటెంటర్‌గా నిలుస్తారు. ఈ టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో ఏటీఎంను ఏర్పాటు చేశారు. బజర్ మోగగానే పరుగెత్తుకెల్లి ఏటీఎంకి అమర్చిన బటన్ నొక్కాలి. ఎవరు ముందుగా నొక్కితే వారు గెలిచినట్లు.
పల్లవి ప్రశాంత్ తలకు గాయం!
ఏటీఎం బజర్ నొక్కేందుకు కంటెస్టెంట్స్ అంతా ప్రయత్నించారు. బజర్ మోగగానే అంతా పరుగెత్తుకెల్లి ఏటీఎం బజర్‌ని నొక్కేందుకు ట్రై చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పల్లవి ప్రశాంత్ తలకు దెబ్బ తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. మిగతా కంటెస్టెంట్స్ అంతా ప్రశాంత్ చుట్టు చేరి ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేశారు. శివాజీ అయితే ఏం పర్లేదు.. ఏం కాలేదని చెబుతున్నాడు. మరి ప్రశాంత్ తలకు ఏ మేరకు గాయమైంది అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment