
బిగ్‌బాస్ లో ఇప్పటికే నాలుగు వారాలు అయిపోయింది. నలుగురు ఎలిమినేట్ అయిపోయారు. కానీ ఈ సీజన్‌లో పెద్దగా జోష్ అయితే కనిపించలేదు. గేమ్స్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గవి జరగలేదు. అయితే తాజాగా కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టిన గేమ్ ఇప్పటివరకు అయిన వాటితో పోలిస్తే కాస్త ఇంట్రెస్ట్ కలిగించింది. ఇందులో ఊహించని వ్యక్తులు విజేతలుగా నిలవడం విశేషం. ఇంతకీ హౌస్‌లో బుధవారం ఏం జరిగిందనేది Day 31 హైలైట్స్‌లో చూద్దాం.
(ఇదీ చదవండి: ఆ రోగంతో బాధపడుతున్న 'జవాన్' నటి.. దీని కారణంగా!)
తెగని గొడవ
ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా స్మైల్ ప్లీజ్ అని ఫస్ట్ టాస్క్ పెట్టారు. చాలా గందరగోళంగా సాగిన అందులో గౌతమ్-శుభశ్రీని విజేతగా ప్రకటించారు. అయితే యవర్ తీర్పుపై హౌసులోని ప్రతిఒక్కరూ అసహనం వ్యక్తం చేశారు. అలా మంగళవారం ఎపిసోడ్ అయిపోయింది. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. రాత్రంతా ఆ గొడవ అలా సాగుతూనే ఉంది.
రెండో టాస్క్
ఇక కెప్టెన్సీ పోటీలో భాగంగా 'దొరికితే దొంగ దొరక్కపోతే దొర' అని రెండో టాస్కు పెట్టారు. ఇందులో భాగంగా యాక్టివిటీ రూంలో బిగ్‌బాస్ ఫ్రెండ్ నిద్రపోతుంటాడు. ఆ రూంలోకి జోడీల్లో ఒక్కో సభ్యుడు వెళ్తాడు. మైకులో బిగ్‌బాస్ ఇచ్చిన క్లూస్ ప్రకారం వస్తువుల్ని కొట్టేయాల్సి ఉంటుంది. ఇలా సాగిన ఈ ఆటలో బాగానే సాగింది. అయితే బయటకొచ్చిన తర్వాత ప్రశాంత్ ఓ వస్తువుని కింద పడేయడంతో దాన్ని పక్కనే ఉన్న యవర్ తీసుకుని తన సంచిలో పెట్టేశాడు. దీంతో బయటంతా గందరగోళంగా మారింది. తెచ్చుకున్న దాంట్లో తీసుకోవడం ఏంట్రా అని శివాజీ గగ్గోలు పెట్టాడు. అయితే ఈ గేమ్‌లో భాష రాని కారణంగా శుభశ్రీ, యవర్ చేతికి దొరికిన వస్తువుల్ని పట్టుకొచ్చేశారు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!)
ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్
అయితే క్లూస్ ఆధారంగా చెప్పిన వస్తువులు కాకుండా రూంలో నుంచి వేరే వస్తువులు కూడా తీసుకొచ్చేయడంపై బిగ్‌బాస్ సీరియస్ అయ్యాడు. అలా అనవసర వస్తువులు ఎవరైతే తక్కువ తీసుకొచ్చారో వాళ్లే ఈ పోటీలో విజేతలన్నట్లు చెప్పాడు. అలా శివాజీ-ప్రశాంత్ ఇందులో విజయం సాధించారు. మూడో టాస్కులో భాగంగా ఫ్రూట్ నింజా అనే గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా జోడీలోని ఒకరు.. దూరంలో ఉన్న మరో వ్యక్తి తలపై ఉన్న బుట్టలో ఆరెంజ్ ఫ్రూట్ వేయాలి. అలా చెప్పిన టైంలో కలెక్ట్ చేసిన ఫ్రూట్స్ నుంచి జ‍్యూస్ సేకరించాలి. ఎవరిదైతే ఎక్కువ పరిమాణం ఉంటుందో వాళ్లు విన్నర్. ఇందులో తేజ-యవర్ విజేతగా నిలిచారు.
ఓవరాల్‌గా చూసుకుంటే గౌతమ్-శుభశ్రీ 4 స్టార్స్, అమరదీప్-సందీప్ 4 స్టార్స్, ప్రశాంత్-శివాజీ 5 స్టార్స్, ప్రియాంక-శోభా 2 స్టార్స్, తేజ-యవర్ 2 స్టార్స్ సాధించారు. దీన్నిబట్టి చూస్తుంటే అస్సలు ఏ మాత్రం అంచనాల్లేని ప్రశాంత్-శివాజీ జోడీ ఈ కెప్టెన్సీ పోటీలో గెలిచారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక వీళ్లిద్దరి మధ్య తొలి కెప్టెన్సీ కోసం పోటీ ఉండనుంది. అది తర్వాత ఎపిసోడ్స్‌లో చూడొచ్చు.
(ఇదీ చదవండి: ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు: 'బాహుబలి' బామ్మ)
Comments
Please login to add a commentAdd a comment