'నీ రక్తాన్ని చిందించడానికి సైతం వెనుకాడలేదు'.. రైతుబిడ్డపై బిగ్‌బాస్ ప్రశంసలు! | Bigg Boss Shares Pallavi Prashant's Beautiful Moments In The House | Sakshi
Sakshi News home page

Bigg Boss: 'అదే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది'.. బిగ్‌బాస్ మాటలకు రైతుబిడ్డ కన్నీళ్లు!

Published Wed, Dec 13 2023 5:24 PM | Last Updated on Wed, Dec 13 2023 5:58 PM

Bigg Boss Shares Pallavi Prashant Beautiful Moments In House - Sakshi

బుల్లితెర ఓ రేంజ్‌లో అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్-7. ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ప్రారంభమైన ఈ షో అదే పంథాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ సీజన్‌.. అందుకు తగ్గట్టుగానే అలరించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, రతిక రీ ఎంట్రీతో ఈ సీజన్‌ సరికొత్తగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో నాలుగు రోజుల్లో మీ అభిమాన రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక గ్రాండ్‌ ఫినాలేకు ఆరుగురు కంటెస్టెంట్స్ అర్హత సాధించారు. మరి వీరిలో ట్రోఫీ ఎవరిని వరిస్తుందో త్వరలోనే తేలిపోనుంది.

ఈ నేపథ్యంలో ఈ వారం హౌస్‌లో ఉన్న ఆరుగురి జర్నీపై వీడియోలను బిగ్‌బాస్‌ ఆడియన్స్‌కు చూపించే ‍ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చివరివారం మొదటి రెండు రోజుల్లో అమర్, అర్జున్, ప్రియాంక, శివాజీ బిగ్ బాస్‌ ప్రయాణాన్ని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్‌ లాగా చూపించారు. ఆ వీడియోను చూసిన కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ తమలోని భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నారు. తమ బిగ్ బాస్‌ ప్రయాణాన్ని స్క్రీన్‌పై చూసి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంటున్నారు. తాజాగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు సంబంధించిన ప్రోమో మేకర్స్ రిలీజ్ చేశారు. 

వీడియోలో బిగ్‌బాస్‌ పల్లవి ప్రశాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బిగ్ బాస్ మాట్లాడుతూ.. 'మట్టితో మనకున్న బంధం విడదీయలేనిది. ఒక కామనర్ల సెలబ్రిటీగా ఈ ఇంట్లో అడుగుపెట్టారు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. టాస్కుల్లో గెలవడానికి నీ రక్తాన్ని చిందించడానికి సైతం వెనుకాడలేదు. మీకు ఇక్కడ రకరకాల వ్యక్తుల రూపంలో స్నేహం దొరికింది. మీరు కృంగిపోయిన ప్రతిసారి లోకం తీరును వివరిస్తూ.. నీ లక్ష్యాన్ని గుర్తు చేసి.. ఏడుపు సమాధానం కాదని.. నీకు ఆ స్నేహమే తెలియజేసింది. నామినేషన్స్‌లో నీలో మరో ప్రశాంత్‌ను అందరికీ చూపించి.. ఓ బలమైన పోటీదారునిగా మిమ్మల్ని నిలిపి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఆకాశం నుంచి జారే ప్రతి నీటిబొట్టు భూమిమీద జీవానికి ఓ అవకాశమే. దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యం నీది' అంటూ బిగ్ బాస్ కొనియాడారు. ప్రశాంత్ ఫుల్ జర్నీ వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement