నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది! | Bigg Boss 7 Weekend Promo: Nagarjuna Fire's On Pallavi Prashanth | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Pallavi Prasanth: పల్లవి ప్రశాంత్ గాలి తీసేసిన నాగార్జున!

Published Sat, Sep 16 2023 4:48 PM | Last Updated on Sat, Sep 16 2023 5:22 PM

Bigg Boss 7 Promo Pallavi Prashanth Nagarjuna - Sakshi

'బిగ్‌బాస్ 7' సీజన్ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఈ వారమంతా గొడవలే టార్గెట్ అన్నట్లు కంటెస్టెంట్స్ తిట్టుకున్నారు. తెగ హడావుడి చేశారు. అయితే వీకెండ్ వస్తే నాగార్జున వచ్చేస్తాడు. అప్పటివరకు జరిగిన వాటికి కౌంటర్స్ ఇచ్చేస్తాడు. అలా ఈ సారి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీకి గట్టిగానే పడ్డాయి. ఇంతకీ తాజా ప్రోమోలో ఏముంది?

'బిగ్‌బాస్' షోలో మిగతా రోజుల్లో ఎలా ఉన్నా గానీ సోమవారం, శని-ఆదివారం మాత్రం మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సోమవారం నామినేషన్ల హడావుడి ఉంటుంది. వీకెండ్ మాత్రం నాగార్జున వచ్చేస్తాడు. అందరికీ పేరుపేరున కౌంటర్స్ ఏసేస్తాడు. మంచి చేస్తే మెచ్చుకుంటాడు. ఎక్కువచేస్తే మాటలతో గాలి తీసేస్తాడు. 

(ఇదీ చదవండి: Bigg Boss 7 : చిల్లర మాటలు.. అతి చేష్టలు.. ‘ఛీ’వాజీ)

అలా ఈ వారం పెద్దగా ఫెర్ఫార్మెన్స్ చేయలేదని శివాజీకి కౌంటర్స్ పడ్డాయి. ప్రతిసారి వయసు అంశాన్ని మాట్లాడుతున్నందుకు షకీలాకు కూడా స్మూత్‌గా పడ్డాయి. ఇక నామినేషన్స్ సందర్భంగా ప్రశాంత్‌పై అమరదీప్ అరిచాడు. ఈ విషయమై స్పందించిన నాగార్జున.. 'అతడు డబ్బులు అతడి ఇష్టం. అతడు ఎవరికైనా ఇచ్చుకుంటాడు నీకెందుకు?' అని అన్నాడు.

హౌసులోకి వెళ్లేటప్పుడు పల్లవి ప్రశాంత్‌కి హోస్ట్ నాగార్జున ఓ మొక్క ఇచ్చాడు. అయితే దాన్ని సరిగా పట్టించుకోకపోవడంతో అది ఆకులు రాలిపోయి, పూర్తిగా వాడిపోయింది. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పిన నాగార్జున.. 'మొక్కనే సరిగా చూసుకోలేకపోయావ్ నువ్వు రైతుబిడ్డవా?' అని అన్నాడు. దీంతో ప్రశాంత్ ముఖం మాడిపోయింది. ఇంకా ఎవరెవర్ని ఏమేం కౌంటర్స్ పడ్డాయో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7: ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement