బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు
కాగా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షో విన్నర్‌గా నిలిచిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయన అభిమానులు అత్యుత్సాహంతో కార్లు, బస్సుల అద్దాలు పగులగొట్టారు. దీంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు.
డిసెంబర్ 20న పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. బిగ్‌బాస్ విన్నర్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
చదవండి: అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక
Comments
Please login to add a commentAdd a comment