బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 ముగింపు దశకు వచ్చింది. ఉల్టా పుల్టా అంటూ గత 100 రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సీజన్ 7కి నేటితో శుభం కార్డు పడనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం అయింది. గత సీజన్‌తో పోలిస్తే.. ఏడో సీజన్ కాస్త బెటర్‌గానే ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించింది. తొలుత 14 మందిని.. ఐదువారాల తర్వాత మరో ఐదు మందిని హౌస్‌లోకి పంపించారు. ఈసారి ఎక్కువగా తెలిసిన ముఖాలే హౌస్‌లో కనిపించడం.. టాస్క్‌లు కాస్త డిఫరెంట్‌గా ఉండడంతో బిగ్‌బాస్ 7 సక్సెస్ అయింది. మేకర్స్ కూడా సీజన్ 7 పట్ల హ్యాపీగా ఉన్నారు.
ఇక ఫినాలేను గతం కంటే గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. టాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోహీరోయిన్లు ఫినాలేలో పాల్గొని అలరించబోతున్నారు. ఓ స్టార్ హీరో ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రేక్షకులు మాత్రం ఫినాలే ఎంత గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారనేది పక్కకి పెట్టి..విన్నర్ ఎవరనేదానిపైనే ఎక్కువ ఆసక్తి కనబర్చుతున్నారు. సోషల్ మీడియాలో సైతం బిగ్‌బాస్ 7 విన్నర్ ఎవరనేదానిపైనే చర్చ జరుగుతుంది.
గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విన్నర్ ఇతనే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హౌస్‌లో పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, అర్జున్, అమర్‌దీప్, యావర్ ఉన్నారు. వీరిలో విన్నర్ ఎవరనేది రేపు సాయంత్రం తెలిసిపోతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అమర్, పల్లవి ప్రశాంత్, శివాజీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విన్నర్ అని నెట్టింట వైరల్ అవుతుంది.
‘సాక్షి’ నిర్వహించిన ఓపినియన్ పోల్‌లో కూడా పల్లవి ప్రశాంత్‌కే ఎక్కువ శాతం ఓట్లు లభించాయి. ‘బిగ్‌బాస్-7 విన్నర్ ఎవరని భావిస్తున్నారు?’అని సాక్షి ఓపినియన్ పోల్ నిర్వహించగా.. ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ పోల్‌లో 40 శాతం ఓట్లతో పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో ఉండగా.. 20 శాతం ఓట్లతో శివాజీ రెండో స్థానంలో నిలిచాడు. అమర్‌దీప్ 16శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 10శాతం ఓట్లతో అర్జున్, ప్రియాంక..4 శాతం ఓట్లతో యావర్ చివరి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే విన్నర్ ఎవరో కామెంట్ చేయడంటూ ‘సాక్షి’ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ పెట్టగా.. అందులో కూడా ఎక్కువ మంది ప్రశాంతే విన్నర్ అవుతారని కామెంట్ చేశారు. మరి నెటిజన్స్ అభిప్రాయపడినట్లుగా ప్రశాంత్ విన్నర్ అవుతారా? లేదా ? అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment