ప్రశాంత్‌ను మడతపెట్టాల్సింది.. రైతుబిడ్డపై అర్జున్‌కు ఇంత పగ ఉందా? | Bigg Boss Telugu 7: Ambati Arjun Back Bitching Against Pallavi Prashanth | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: ఆ వెర్రిపుష్పాన్ని టాస్కులో మడతపెట్టేయాల్సింది.. ఒక్క టాస్క్‌ పడనీ, చెప్తా..!

Published Fri, Oct 13 2023 1:13 PM | Last Updated on Fri, Oct 13 2023 1:44 PM

Bigg Boss Telugu 7: Ambati Arjun Back Bitching Against Pallavi Prashanth - Sakshi

బిగ్‌బాస్‌ 7.. ఈ షో అంతా రైతుబిడ్డ చుట్టే తిరుగుతోంది. మొదటి నుంచీ అతడిని దూరం పెడుతూ.. తనేం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకుంది సీరియల్‌ బ్యాచ్‌. అందుకే ఈ బ్యాచ్‌పై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ముఖ్యంగా విన్నర్‌గా వెలిగిపోతాడనుకున్న అమర్‌దీప్‌ సైతం అదే బ్యాచ్‌లో ఉండి ఆటలో ఆరిపోయాడు. ప్రశాంత్‌ ముందు తేలిపోయాడు. అందరినీ వెనక్కు నెట్టి ఈ సీజన్‌లోనే తొలి కెప్టెన్‌గా అవతరించాడు ప్రశాంత్‌.

సలహాను బేఖాతరు చేసిన రైతుబిడ్డ
ప్రశాంత్‌ విజయం సీరియల్‌ బ్యాచ్‌కు నచ్చలేదని టాక్‌ నడిచింది. కానీ ఇటీవల వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్‌ సైతం ఈ గెలుపు మింగుడుపడనట్లు కనిపిస్తోంది. నిన్న రాత్రి లైవ్‌లో రైతుబిడ్డపై విషాన్ని కక్కాడు. సాధారణంగా రైతుబిడ్డ.. శివాజీ మాట తప్ప హౌస్‌లో ఎవరి మాటా వినడు. అర్జున్‌ ఏదో సలహా ఇస్తే అది పట్టించుకోకుండా వెళ్లిపోయాడట. దీంతో అర్జున్‌ మండిపోయాడు. గౌతమ్‌ దగ్గర ప్రశాంత్‌ గురించి నోటికొచ్చింది మాట్లాడాడు.

టాస్కులో మడతపెట్టి..
అర్జున్‌ ఏమన్నాడంటే.. 'ఆ ఎర్రిపుష్పం గాడికి ఓ సలహా ఇస్తే లైట్‌ తీసుకున్నాడు. ఒక్క టాస్క్‌ ఏదైనా పడనీ, చెప్తా.. మొన్న కలర్‌ టాస్క్‌లో మొత్తం మడతపెట్టేసి ఉండాల్సింది. ఎందుకు వదిలేశినవ్‌? ఆ టాస్కులో మడతపెట్టేయాల్సింది. అప్పుడు వీడు ఆడుతడు, వీడు ఆడుతడు అనే మాటనే ఎగిరిపోయేది' అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన జనాలు అర్జున్‌ మాటలు విని షాకవుతున్నారు.

నీకన్నా అమర్‌ నయం..
ఐదు వారాల నుంచి ప్రశాంత్‌ అంతలా కష్టపడి ఆడుతుంటే ఇప్పుడు మధ్యలో వచ్చి అతడిని ఇలా అనడం కరెక్ట్‌ కాదని కామెంట్లు చేస్తున్నారు. అర్జున్‌ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోందంటున్నారు. నీ కన్నా అమర్‌ నయం, అతడు నటించలేదు, తన నోటివాగుడు వల్ల నెగెటివ్‌ అయ్యాడు.. నువ్వు సీజన్‌ ప్రారంభం నుంచి ఉండుంటే ఇంకా అతడి కన్నా ఎక్కువ నెగెటివ్‌ అయ్యేవాడివి అని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

చదవండి: లేడీ కంటెస్టెంట్‌పై వేలాడుతున్న ఎలిమినేషన్‌ కత్తి, వరుసగా ఆరోసారి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement