బిగ్‌బాస్ 7లో ఆడుతున్న రైతుబిడ్డ మాటల మార్చి దొరికిపోయాడు. ప్రూఫ్స్‌తో సహా హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇక శివాజీ హౌసులో ఉంటాడా? వెళ్లిపోతాడా అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇన్నాళ్లు శివాజీ గురించి పెద్దగా మాట్లడని కంటెస్టెంట్ అతడి గురించి నిజాల్ని బయటపెట్టాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 48 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
భోలెకి నాగార్జున క్లాస్
కెప్టెన్సీ టాస్కులో సందీప్, అర్జున్ చివరి స్టేజీకి చేరుకోవడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. వీళ్లిద్దరి మధ్య ఫైనల్ గేమ్ పెట్టడంతో శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇందులో గెలిచిన అర్జున్.. బిగ్‌బాస్ 7 హౌసుకి మూడో కెప్టెన్ అయ్యాడు. ఇక ఇదంతా చూసిన హోస్ట్ నాగార్జున ప్రస్తుతానికి వచ్చేశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరికీ క్లాస్ పీకాడు. ఈ వారం నామినేషన్స్‌లో బూతులు మాట్లాడి అతి చేసిన భోలెకి గట్టిగా పడ్డాయి. అతడు మరోసారి ఇలాంటివి జరగవని చెప్పాడు. దీంతో సమస్య అక్కడితో సాల్వ్ అయింది.
(ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి)
రైతుబిడ్డ నిజస్వరూపం
రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో ప్రతిసారి సింపతీ గేమ్ ఆడుతున్న ప్రశాంత్.. ఈసారి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా.. సందీప్ తనని 'ఊరోడు' అని అన్నాడని, అది తనకు నచ్చలేదని కారణం చెప్పాడు. ఇప్పుడు అదే విషయాన్ని బయటకు తీసిన హోస్ట్ నాగార్జున.. మొత్తం గొడవ క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే నామినేషన్స్‌లో పూనకం వచ్చినట్లు రెచ్చిపోయిన ప్రశాంత్.. నాగ్ అడిగేసరికి మాత్రం నంగనాచి కబుర్లు చెబుతూ పిల్లిలా ప్రవర్తించాడు.
హౌస్ట్ నాగార‍్జున.. ప్రశాంత్ చేసి తప్పని నేరుగా చెప్పొచ్చు. కానీ అలా చేయలేదు. ఇంట్లోని సభ్యులైన పూజా, అర్జున్‌లతో ఈ విషయాన్ని చెప్పించాడు. ప్రశాంత్ మాటలు మార్చేస్తున్నాడని ఈ ఇద్దరు చెప్పారు. దీంతో రైతుబిడ్డ నిజస్వరూపం బయటపడినట్లయింది. అయితే సందీప్ చెప్పిన తర్వాత అలా కాదు ఇలా అన్నానని చెప్పడానికి ప్రయత్నించానని, కానీ చెప్పే అవకాశం ఇవ్వలేదని నాగార్జునతో చెప్పాడు. కానీ ఇది కూడా అబద్ధమే. నాగ్ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఈ గొడవని పుల్‌స్టాప్ పెడదామని ఫిక్స్ అయిన నాగ్.. 'నేను గర్వంగా చెబుతున్నా మా నాన్న ఊరోడు' అని అనడంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. కానీ ప్రశాంత్ మాటలు మార్చి అడ్డంగా దొరికిపోవడంతో అతడి పరువంతా పోయినట్లయింది.
(ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా)
పాము నిచ్చెన గేమ్
ఇక బిగ్‌బాస్ 7వ సీజన్ 100 రోజుల గేమ్ అని, శనివారం 50వ రోజు అని చెప్పిన నాగార్జున.. పాము-నిచ్చెన అనే గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా ఒక్కో కంటెస్టెంట్స్.. హౌసులోని తమకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు కిందకు లాగుతున్నారు? అనేది చెప్పాల్సి ఉంటుంది.
కంటెస్టెంట్.. నిచ్చెన, పాము ఎవరు?
అశ్విని.. గౌతమ్, శోభా
గౌతమ్.. అర్జున్, శివాజీ
శివాజీ.. యవర్, అమరదీప్
అమరదీప్.. అర్జున్, తేజ
అర్జున్.. గౌతమ్, శివాజీ
యవర్.. శివాజీ, గౌతమ్
పూజా.. అర్జున్, అశ్విని
ప్రియాంక.. శోభా, అశ్విని
భోలె.. శివాజీ, శోభాశెట్టి
శోభాశెట్టి.. ప్రియాంక, భోలె
సందీప్.. శోభా, శివాజీ
తేజ.. అమరదీప్, యవర్
ప్రశాంత్.. శివాజీ, పూజా
ఈ ఆటలో భాగంగా శివాజీ రెండు వైపుల ఉన్నాడు. అతడి సపోర్టర్స్ అయిన ప్రశాంత్, యవర్, భోలె.. నిచ్చెన అని చెప్పారు. మరోవైపు గౌతమ్, అర్జున్,సందీప్.. శివాజీ పాములాంటోడని చెప్పారు. మరోవైపు శివాజీ.. తన ఆరోగ్యం గురించి నాగార్జునతో మాట్లాడాడు. శరీరం సహకరించట్లేదని బయటకెళ్లిపోతానని అన్నాడు. ఉండమని చెప్పడంతో.. ఫిజియోని ఏర్పాటు చేయాలని శివాజీ అన్నాడు. దీనికి నాగ్ ఒప్పుకొన్నాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఏడో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఆదివారం ఎపిసోడ్‌లో తేలుతుంది.
(ఇదీ చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?)
Comments
Please login to add a commentAdd a comment