'మీ దోస్తాన్‌ మళ్లీ స్టార్ట్‌ చేసిర్రు'.. నా కళ్లు తెరుచుకున్నాయన్న రైతు బిడ్డ! | Bigg Boss Latest Promo Released During Nominations war | Sakshi
Sakshi News home page

Bigg Boss: 'బరాబర్‌ నువ్వే చేశావ్‌'.. ప్రశాంత్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన శోభాశెట్టి!

Published Mon, Nov 27 2023 6:22 PM | Last Updated on Tue, Nov 28 2023 11:18 AM

Bigg Boss Latest Promo Released During Nominations war - Sakshi

బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్‌ చేస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్-7 మరో వారం ముగిసింది. గతవారం ఎవరిని ఎలిమినేట్ చేయని బిగ్‌బాస్‌.. ఈ సారి ఏకంగా ఇద్దరిని ఇంటికి పంపించేశాడు. ఇప్పటివరకు హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ  ముగియడంతో మళ్లీ నామినేషన్స్ పర్వం మొదలైంది. ఇప్పటి నుంచి టాప్‌-5 లో నిలిచేందుకు టఫ్ ఫైట్‌ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియలో వాదనలు వేరే లెవెల్లో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. 

ప్రోమో ప్రారంభంలోనే యావర్‌ను నామినేట్‌ చేస్తూ శోభాశెట్టి.. గేమ్ ఓవర్‌ శెట్టి అని రాశావ్ అంటూ చెప్పింది. దీనికి నువ్వు చూశావా అని యావర్ అడగడంతో.. నేను చూడలేదంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్‌ను అమర్‌ నామినేట్ చేశాడు. దీంతో రైతు బిడ్డ ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు.   దీంతో అమర్.. పోరా కూర్చోపో.. ఎలిమినేట్‌ చేయను పో అన్నాడు. దీనికి అన్నా నిన్ను నమ్మినందుకు నేను బాధపడతున్నా అంటూ ప్రశాంత్ మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వతా శివాజీని నామినేట్ చేస్తూ మధ్యలో ప్రశాంత్ టాపిక్ తీసుకొచ్చాడు గౌతమ్. నేను ఎప్పుడైనా యావర్‌, ప్రశాంత్‌కు సపోర్ట్ చేశానా? అని గౌతమ్‌ను ప్రశ్నించాడు. 

ఆ తర్వాత గౌతమ్‌ను అమర్‌ నామినేట్ చేశాడు. నాకు సపోర్ట్ చేస్తా అని మోసం చేశావ్ అన్నాడు. మధ్యలో శివాజీ ఎంటరయ్యాడు. వాంటెడ్‌గా చేస్తుంటే జనాలేమైనా పిచ్చోళ్లా ఇక్కడ ఉంచడానికి అని గౌతమ్ ఫైరయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్‌ను శోభా నామినేట్ చేస్తూ.. నువ్వు చాలా సేఫ్‌గా ఆడావు.. నీవల్లే అమర్ కెప్టెన్సీ పోయిందంటూ నామినేట్ చేసింది. దీనికి ఆశ్చర్యపోయిన ప్రశాంత్‌ అన్నా.. నా వల్లే కెప్టెన్సీ పోయిందా? అని అమర్‌ను అడిగాడు. దీనికి ప్రశాంత్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయింది శోభా. దీనికి మీరు మళ్లీ దోస్తాన్ స్టార్ట్ చేసిర్రు.. నా కళ్లు ఇప్పడే తెరుచుకున్నాయి అన్నాడు ప్రశాంత్. దీనికి శోభా.. అవును బరాబర్‌ ఆ రోజు సేఫ్‌ గేమ్ ఆడింది పల్లవి ప్రశాంత్‌ అంటూ గట్టిగానే వాదించింది. దీంతో ప్రోమో ముగిసింది. ఎవరు, ఎవరినీ నామినేట్ చేశారనేది పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement