బిగ్ బాస్ అర్జున్ అంబటి 'వెడ్డింగ్ డైరీస్' టీజర్ విడుదల | Arjun Ambati Wedding Diaries Movie Official Teaser | Sakshi
Sakshi News home page

బిగ్ బాస్ అర్జున్ అంబటి 'వెడ్డింగ్ డైరీస్' టీజర్ విడుదల

Published Thu, Aug 15 2024 7:00 PM | Last Updated on Thu, Aug 15 2024 8:10 PM

Arjun Ambati Wedding Diaries Movie Official Teaser

టాలీవుడ్‌లో పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలకు కూడా మంచి ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో 'వెడ్డింగ్ డైరీస్' అనే సినిమా తెరకెక్కుతుంది.  MVR స్టూడియోస్ పేరుతో  డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ ఫెమ్ అర్జున్ అంబటి హీరోగా , చాందిని తమిలారసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన 'వెడ్డింగ్ డైరీస్' ఆగస్టు 23న విడుదలకి సిద్ధమైంది. అయితే, తాజాగా టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ .. 'వివాహిత జంట తమ సంబంధంలోని ఇబ్బందులు, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో ఈ సినిమా చూపిస్తుంది. రోజూ వచ్చే విభేదాల వల్ల నిరాశతో విసిగి వారు విడిపోవాలని నిర్ణయానికి వస్తారు. కానీ, తర్వాత ప్రేమను, తమ బంధాన్ని ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలుసుకుని, పెళ్లిని పునర్నిర్మించుకోవాలని  నిర్ణయించుకుంటారు.  ఈ చిత్రం ప్రేమ, దీర్ఘకాలిక సంబంధాలపై ఉన్న విలువలను వివరిస్తుంది.' అని ఆయన పేర్కొన్నారు. అర్జున్ అంబటి,చాందిని తమిళరసన్‌తో పాటు చమ్మక్ చంద్ర, మేక రామకృష్ణ, రవి తేజ తదితరులు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా కి మదన్ ఎస్.కే సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement