బిగ్‌బాస్ షోలో నామినేషన్స్- ఎలిమినేషన్స్‌కు విడదీయలేని సంబంధం ఉంది. ఎందుకంటే నామినేట్ అయినవారు ఎలిమినేట్ అవకా తప్పదు. ఎలిమినేట్ చేయడం కోసం అవతలివారిని నామినేట్ చేయకా తప్పదు. ఈ సీజన్‌పై ఎక్కువగా ఆసక్తిని క్రియేట్ చేసింది నామినేషన్సే! ఈ నామినేషన్స్‌లో ఎన్ని ఎక్కువసార్లు ఉంటే అంత పుంజుకోవచ్చన్నది కొందరి వాదన. నామినేషన్స్‌కు భయపడి దూరంగా ఉంటే మాత్రం ఇక అంతే సంగతులు. లేకలేక ఒక్కవారం నామినేషన్‌లోకి వచ్చి ఇట్టే ఎలిమినేట్ అయిపోయాడు సందీప్.
అదే మైనస్..
బిగ్‌బాస్ ప్రారంభమైన నెల రోజుల తర్వాత హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు అర్జున్. ఇతడు మాట్లాడే మాటలకు అవతలి వారి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! అంత సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడతాడు అర్జున్. కానీ నెల రోజులు ఆలస్యంగా హౌస్‌లోకి రావడంతో జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయాడు. టాస్కుల్లో బాహుబలిలా ఆడాడు. ఎవరి అండదండలు లేకపోయినా సొంతంగా ఆడుతూ చివరి వరకు వచ్చాడు. కానీ మొదటి నుంచీ లేకపోవడంతో ఓసారి నామినేషన్స్‌లోకి వచ్చి ఎలిమినేట్ అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఫినాలే అస్త్ర సాయంతో ఎలిమినేషన్ నుంచి గట్టెక్కి నేరుగా ఫినాలేలో అడుగుపెట్టాడు.
టాప్ 6లో ఉండగా ఎలిమినేట్..
జనాదరణ పొందడంలో వెనకబడిన ఇతడు ఆరో స్థానంలో ఉండగానే షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సీరియల్ నటుడిగా గొప్ప పేరున్న ఇతడు రోజుకు దాదాపు రూ.50 వేల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే వారానికి రూ.3,50,000 తీసుకున్నాడన్నమాట! ఈ లెక్కన 10 వారాలకుగానూ అర్జున్ రూ.35,00,000 వెనకేశాడు. లేటుగా హౌస్‌లోకి వచ్చినప్పటికీ చాలామందికంటే ఎక్కువగానే సంపాదించాడు అర్జున్. కానీ ఇందులో దాదాపు సగం వరకు ప్రభుత్వానికి ట్యాక్స్‌ల రూపంలో అప్పజెప్పాల్సి ఉంటుంది.
చదవండి: పీకల్లోతు అప్పుల్లో యావర్.. ప్రైజ్‌మనీ కూడా సరిపోదన్న ప్రిన్స్ సోదరుడు
Comments
Please login to add a commentAdd a comment