బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి తండ్రి అయ్యాడు. అర్జున్ భార్య సురేఖ ఈ రోజు (జనవరి 9) పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన కూతురుకి ఆర్ఖా అని నామకరణం చేశాడు. కూతురు పుట్టినా, కొడుకు పుట్టినా ఈ పేరునే పెట్టుకుంటానని బిగ్‌బాస్ హౌస్‌లోనే చెప్పాడు అర్జున్. తన పేరులోని ఆర్.. సురేఖ పేరులో నుంచి ఖ తీసుకొని అర్ఖా అని పేరు ఫిక్స్ చేసినట్లు ఓ వీకెండ్ ఎపిసోడ్‌లో చెప్పాడు. అయితే తనకు మాత్రం కూతురు పుట్టాలనే ఉందని చెప్పాడు. అనుకున్నట్లే అర్జున్‌కి కూతురే పుట్టింది. దీంతో అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి.
అర్జున్-సురేఖ దంపతులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, పలు సీరియళ్లలో హీరోగా నటించిన అర్జున్.. బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొని తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. షో ప్రారంభమైన ఐదు వారాల తర్వాత అర్జున్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. కానీ అర్జున్ మాత్రం చివరి వరకు ఉన్నాడు. ఫినాలే రోజు టాప్ 6 ప్లేస్‌లో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం బుల్లితెరపై షోలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment