రైతుబిడ్డని వదలని రతిక.. అమర్‌, యావర్‌ల కొట్లాట ఆగేదేలే! | Bigg Boss 7 Telugu: 12th Week Nominations List Revealed | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: అరుస్తూ నువ్వు చేసిందేంటి శివాజీ?.. అర్జున్‌ ప్రశ్నకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడి ఉంటుందే!

Published Mon, Nov 20 2023 11:45 AM | Last Updated on Mon, Nov 20 2023 12:11 PM

Bigg Boss 7 Telugu: 12th Week Nominations List Revealed - Sakshi

బిగ్‌బాస్‌ షోలో గతవారం ఎలిమినేషన్‌ ఎత్తేయడంతో కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. మరీ ముఖ్యంగా అశ్విని, రతిక అయితే తమ ప్రతాపం చూపించడానికి ఇంకో వారం దొరికిందని లోలోపలే సంతోషించారు. 12వ వారం నామినేషన్స్‌ మొదలుపెట్టాడు బిగ్‌బాస్‌. గేమ్‌లో ఫౌల్స్‌ ఆడావని యావర్‌ను నామినేట్‌ చేశాడు అమర్‌. అయితే అది తన తప్పు కాదని, సంచాలకుడిగా ఎవరేం తప్పు చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అమర్‌ మీద మండిపడ్డాడు.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఎలిమినేషన్‌ ఫ్రీ పాస్‌ కోసం ఇచ్చిన టాస్కుల్లో ఒకటైన విల్లు గేమ్‌లో ఇద్దరూ తప్పు చేశారంటూ యావర్‌, శివాజీలను నామినేట్‌ చేశాడు అర్జున్‌. గేమ్‌లో అందరూ అరుస్తుంటే ఏకాగ్రత దెబ్బ తిందన్న నువ్వు గేమ్‌లో అవుట్‌ అవగానే మిగతావాళ్లు ఆట ఆడుతున్నా పట్టించుకోకుండా అరిచేశావని కరెక్ట్‌ పాయింట్‌ లాగాడు.

దీంతో శివాజీ తన దగ్గర సమాధానం లేక నవ్వి ఊరుకున్నాడు. గౌతమ్‌.. ప్రశాంత్‌, శివాజీని.. రతిక.. ప్రశాంత్‌, అమర్‌లను నామినేట్‌ చేశారు. మొత్తానికి ఈ వారం కెప్టెన్‌ ప్రియాంక, శోభా శెట్టి మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నామినేషన్స్‌ ఎలా జరిగాయి? ఎవరు కరెక్ట్‌ పాయింట్స్‌ చెప్పారు? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

చదవండి:  'మళ్లీ చెప్తున్నా, అలా చేసుంటే భారత్‌ గెలిచేది..' నటుడి వ్యాఖ్యలపై ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement