
విశ్వ కార్తికేయ....తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆయన బాలకృష్ణ, బాపు, రాజేంద్రప్రసాద్ గారి లాంటి ఎంతోమంది స్టార్స్‌తో వర్క్ చేశాడు. సుమారు 50కి పైగా చిత్రాలలో బాలనటుడిగా చేసి, నంది అవార్డు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, స్టేట్ అవార్డు ఫర్ మెరిటోరియస్ అచీవ్‌మెంట్.. ఇలా ఎన్నో పురస్కారాలు పొందాడు.
ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ హీరోగా మారి జైసేన, కళాపోషకులు, ఐపిఎల్, అల్లంతదూరన అనే సినిమాలు చేసి డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. కథకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకి సాగుతున్నాడు ఈ యువ హీరో. అయితే ఆ స్పీడ్ సరిపోలేదు అనుకున్నాడో ఏమోగాని గేర్ మార్చి ఇటీవల పాన్ ఇండియన్ సినిమా ఎన్త్ హవర్‌తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు. రాజు గుడిగుంట్ల దీని దర్శక నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్త్ హవర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
అయితే ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారిన మరో విషయం ఏంటంటే విశ్వ కార్తికేయ ఇటీవల ఒక ఎక్స్‌పరిమెంటల్ థ్రిల్లర్ స్క్రిప్ట్‌ను ఓకే చేశాడట! త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఆ మూవీ కోసం మరింత ఫిట్ అయ్యేందుకు కసరత్తులు చేస్తున్నాడట. అయితే ఆ సినిమా విషయాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. టాలెంట్ ఉన్న హీరోగా ఆల్రెడీ గుర్తింపు సంపాదించుకున్న విశ్వ.. కరెక్ట్ కంటెంట్ పడితే స్టార్ లిస్ట్‌లో చేరడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment