
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం వెడ్డింగ్ డైరీస్. ఎమ్ వి ఆర్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ గారు మాట్లాడుతూ "వెడ్డింగ్ డైరీస్ ట్రైలర్ చూశాను. చాలా ఆసక్తికరంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చే అపార్థాలు, అపోహలు శాశ్వతం కాదు. వైవాహిక బంధం మాత్రమే చిరకాలం ఉంటుందనే మంచి కథను తీసుకున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను" అన్నారు.
దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ "దాంపత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో ఈ మూవీ చూపిస్తుంది. రోజూ జరిగే గొడవలు, విభేదాలతో విసిగిపోయిన దంపతులు విడిపోవాలనుకుంటారు. కానీ తమ బంధం ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలిసిపోవాలని నిర్ణయించుకుంటారు. ఆగస్టు 23న మహా మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నాం" అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment