ఎవరూ ఒప్పుకోలేదట.. చివరికి ఇతడే బజ్‌ హోస్ట్‌గా! | Bigg Boss 8 Telugu: Buzz Host was Ambati Arjun | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: ఎవరూ ఒప్పుకోలేదట.. చివరికి ఇతడే బజ్‌ హోస్ట్‌గా!

Published Wed, Aug 28 2024 7:02 PM | Last Updated on Wed, Aug 28 2024 8:30 PM

Bigg Boss 8 Telugu: Buzz Host was Ambati Arjun

బిగ్‌బాస్‌ షోలో జనాలు ఎంతో ఆసక్తికరంగా చూసేది రెండే రెండింటి కోసం.. ఒకటి నామినేషన్‌, మరొకటి ఎలిమినేషన్‌. ఎలిమినేట్‌ అయిన వారు స్టేజీపైకి వచ్చి రెండు మాటలు చెప్పివెళ్లిపోతారు. వారి మనసులో ఏముంది, లోపల ఏం జరుగుతోంది? ఎలిమినేట్‌ అవుతారని ముందే ఊహించారా? ఇవన్నీ వివరంగా తెలుసుకునేందుకు సెపరేట్‌గా బిగ్‌బాస్‌ బజ్‌ అనే ప్రోగ్రామ్‌ ఉండనే ఉంది.

ఎవరిని అడిగినా..
బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్‌కు కచ్చితంగా రావాల్సిందే! గత సీజన్‌లోని ఓ టాప్‌ కంటెస్టెంట్‌ను మరుసటి సీజన్‌కు హోస్ట్‌గా పెడతారు. అలా ఈసారి గత సీజన్‌లోని కంటెస్టెంట్లను యాంకర్‌ పోస్ట్‌కు ఆహ్వానించారట.. కానీ చాలామంది తమ ప్రాజెక్టులు, ఆఫర్లతో బిజీగా ఉండటంతో వచ్చేదేలేదని చెప్పేశారట.

టైం బాలేకపోతే..
దీంతో కండలవీరుడు అర్జున్‌ అంబటిని రంగంలోకి దింపారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా విడుదల చేశారు. టైం బాగున్న కొందరు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వస్తున్నారు.. వాళ్ల టైం బాగోలేకపోతే బిగ్‌బాస్‌ బజ్‌లోకి వస్తారంటూ అర్జున్‌ ప్రాస కలిపేశాడు. ప్రోమో అయితే బాగుంది.. అర్జున్‌ హోస్టింగ్‌ పూర్తి స్థాయిలో చూడాలంటే ముందు బిగ్‌బాస్‌ షురూ అయ్యేంతవరకు ఆగాలి. ఇకపోతే తెలుగుబిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌ సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభం కానుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement