
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో యష్మి గౌడ పన్నెండోవారం ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చేసిన ఆమె నేరుగా బిగ్‌బాస్ బజ్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ అంబటి అర్జున్.. యష్మి అనే నేను, అన్నీ నిజాలే చెప్తానంటూ తనతో ప్రమాణం చేయించాడు. ఎందుకు బయటున్నావని ఆలోచించావా? అని అడగ్గా.. హౌస్‌లో నా అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. చూసే జనాలకు అది ఫ్లిప్పులా అనిపిస్తుందేమో అని యష్మి సమాధానమిచ్చింది.

గ్రూప్ గేమ్ ఆడావా? లేదా?
ఈ ప్రవర్తనను ఉడుకుబోతుతనం అంటారని అర్జున్ సెటైర్ వేశాడు. గ్రూప్ గేమ్ ఆడావా? లేదా? నామినేషన్స్‌లో గ్రూప్‌గా చర్చించుకుని నామినేట్ చేశారా? లేదా? అని వరుస ప్రశ్నలు సంధించాడు. నిఖిల్‌పై నీ ఫీలింగ్ ఏంటనగా.. అతడు తనకు మంచి స్నేహితుడు అని చెప్పింది యష్మి.

నేను ఏం చేసినా ఫీలింగ్స్ ఉన్నాయంటారు
మీకు ఫీలింగ్స్ లేనప్పుడు గౌతమ్ టీషర్ట్ వేసుకుని నిఖిల్‌కు జెలసీ తెప్పించాలని ఎందుకనుకున్నావ్? అని క్వశ్చన్ చేశాడు. అందుకు యష్మి సమాధానం దాటవేస్తూ.. ఇప్పుడిదంతా జరిగింది కాబట్టి.. నేను కొంచెం నవ్వినా సిగ్గుపడుతుంది, ఫీలింగ్స్ ఉన్నాయంటారు. దానికి నేనేం చేయలేను అంది.
Comments
Please login to add a commentAdd a comment