బిగ్‌బాస్ హౌస్‌లో టికెట్ టు ఫినాలే అస్త్ర పోటీ చివరి దశకు చేరుకుంది. బిగ్‌బాస్ పెట్టిన గేమ్స్‌లో ఎక్కువగా అర్జున్, రైతుబిడ్డ గెలుచుకుంటూ పోగా అమర్ అందరి దగ్గరా పాయింట్లు అడుక్కుంటూ టాప్ స్థానంలో నిలబడ్డాడు. నిజానికి అతడికి ఎవరూ పాయింట్లు ఇవ్వకపోయినా టాప్ 3-4 స్థానాల్లో ఉండేవాడే! కానీ ఎక్కడ రేసులో నుంచి అవుట్ అయిపోతానో అన్న భయంతో అందరినీ బతిమాలుకుంటున్నాడు. చూడటానికి అది అడుక్కుంటున్నట్లుగానే ఉందని నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి.
కేవలం రెండు టాస్కులు మాత్రమే గెలిచిన అమర్ అందరూ ఇచ్చిన పాయింట్లతో స్కోర్ బోర్డ్‌లో టాప్‌లో ఉన్నాడు. కానీ అర్జున్ ఎవరి దగ్గరా ఒక్క పాయింట్ తీసుకోకుండా సొంతంగా ఆడి ఐదు గేమ్స్ గెలిచాడు. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం అర్జున్ టికెట్ టు ఫినాలే గెలిచినట్లు తెలుస్తోంది. అంటే అతడు టాప్ 5లో అడుగుపెట్టేసినట్లే అనుకోకండి.. తనముందు ఎలిమినేషన్ గండం ఉంది.
ఈవారం ఎలిమినేషన్ దాటుకుని ముందుకు వస్తేనే అతడు ఫినాలేలో అడుగుపెడతాడు. నామినేషన్‌లో ఎంతో నెగెటివిటీ ఉన్నా టికెట్ టు ఫినాలేలో మాత్రం టాస్కులతో అదరగొట్టి అదుర్స్ అనిపించుకున్నాడు అర్జున్. ఎవరి సాయం లేకపోయినా ఒంటరిగా పోరాడి గెలిచాడు. మరి అతడు ఈ వారం సేవ్ అవుతాడా? టాప్ 5లో నిలుస్తాడా? చూడాలి!
చదవండి: పెళ్లైన ఏడాదికే రెండో భార్యకు విడాకులు? అందుకే వీడియో డిలీట్!
Comments
Please login to add a commentAdd a comment