
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్లు.. సంతోషమొచ్చినా, బాధొచ్చినా అస్సలు ఆపుకోలేడు ప్రిన్స్ యావర్. ఏదీ మనసులో పెట్టుకోడు. తనకు అనిపించింది ముఖం మీదే అడిగేస్తాడు. కాకపోతే అప్పుడప్పుడూ టెంపర్ లూజవుతూ ఉంటాడు. టాస్కుల్లో అగ్రెసివ్‌గా ఆడతాడు. అది ఫన్నీ టాస్క్ అయినా, సీరియస్ టాస్క్ అయినా చావోరేవో అన్న రీతిలో బరిలోకి దూకుతాడు. ఓడిపోతే అస్సలు తట్టుకోలేడు.. ఫ్రస్టేట్ అవుతుంటాడు.
ఆకలి బాధ..
అయితే తన కోపానికి, ఆవేశానికి, బాధకు అసలు కారణం ఆకలి అని ఒకానొక సమయంలో బయటపెట్టాడు ప్రిన్స్. తను ఏదైనా సాధించాలన్న ఆకలితో అలమటిస్తున్నట్లు చెప్పాడు. ధరించడానికి సరైన బట్టలు కూడా లేవని.. రెండు జతలు మాత్రమే ఉన్నాయని, పీకల్లోతు అప్పుల్లో ఉన్నానని చెప్తూ ఏడ్చేశాడు. తన అన్నల వల్లే బిగ్‌బాస్ షో వరకు రాగలిగానని, తనకు డబ్బు చాలా అవసరమని ఎమోషనలయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రిన్స్ యావర్ సోదరుడు తమకు అప్పులు ఉన్న మాట వాస్తవమేనన్నాడు. రూ.50 లక్షలు ఇచ్చినా తమకు సరిపోవన్నాడు.
చాలా అప్పుల్లో కూరుకుపోయాం..
ప్రిన్స్ సోదరుడు మాట్లాడుతూ.. 'మాది ఉమ్మడి కుటుంబం. మేము నలుగురం అన్నదమ్ములం.. ఇంకా నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. లోన్లు తీసుకుని వారికి పెళ్లి చేశాం. రూ.30-35 లక్షల వరకు అప్పు ఉంది. మాకు సరైన ఇల్లు కూడా లేదు. ప్రిన్స్ బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు.. తనకు వచ్చే డబ్బుతో మంచి ఇల్లు తీసుకుందాం అన్నాడు. మరోపక్క లక్షల్లో అప్పులు.. మా పరిస్థితి అంత దయనీయంగా ఉంది' అని చెప్పాడు. ఇప్పటికే ప్రిన్స్ గ్రాండ్ ఫినాలేలో రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అప్పుల్లో కూరుకుపోయిన ప్రిన్స్ యావర్‌కు మరింత డబ్బు ఆఫర్ చేసుంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment