శివాజీ... బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ ఇచ్చిన హైప్ చూస్తే నిజంగా గెలిచేస్తాడేమో అని అందరూ తెగ భయపడ్డారు. ఎందుకంటే ఈ సీజన్ మొదటిరోజు నుంచి సోఫాపై కూర్చుని ఆర్డర్స్ వేయడం, ప్రశాంత్-యావర్‌లతో పనిచేయించుకోవడం తప్పితే ఒక్క విషయంలోనూ ఎంటర్‌టైన్ చేయలేకపోయాడు. నాగార్జున అయితే మాస్టర్ మైండ్, చాణక్య లాంటి పెద్దపెద్ద బిరుదులిచ్చేసి శివాజీని ఆకాశంలో కూర్చోబెట్టాడు. చివరకు అక్కడి నుంచే కిందకు తోసేశాడు. అసలు ఈ సీజన్‌లో శివాజీ ఏం చేశాడు? ఇంతకీ ఆడాడా లేదా?
నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా శివాజీ కాస్తోకూస్తో గుర్తింపు ఉంది. అప్పట్లో హీరో, సైడ్ క్యారెక్టర్ తరహా పాత్రలు చేశాడు కానీ ఆ తర్వాత ట్రెండ్‌కి తగ్గట్లు మింగిల్ కాలేక యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. అలా నటుడిగా కనుమరుగైపోయాడు. రాజకీయాల్లోకి వచ్చి 'గరుడ పురాణం' చెప్పాడు. చాల్లే నీ సేవలు అని చెప్పి పక్కకు తోసేశారు. ఇక అన్నీ అయిపోయేసరికి ఏం చేయాలో తెలీక పిల్లల మీద ప్రతాపం చూపించడానికా అన్నట్లు బిగ్‌బాస్ లోకి వచ్చాడు. ఇక్కడ కూడా మనోడికి మొండిచెయ్యే మిగిలింది. కప్ కొట్టడం సంగతి అటుంచితే కనీసం రన్నరప్ కూడా కాలేకపోయాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
శివాజీ బిగ్‌బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. 3-4 వారాలు ఉంటే గ్రేట్ అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఫినాలే వరకు వచ్చేశాడు. ఏ మాత్రం పనిచేయకపోయినా సరే టాప్-3 వరకు వచ్చేశాడు. అయితే శివాజీ ఈ షోకే అనర్హుడు అని చెప్పడానికి బోలెడన్ని కారణాలున్నాయి. అందులో మొదటిది నాగార్జున సపోర్ట్. గేమ్ షో అంటే సొంతంగా ఆడాలి. కానీ శివాజీ ఎప్పుడు అలా చేసింది లేదు. నోటికొచ్చింది మాట్లాడేయడం.. వీకెండ్ వచ్చేసరికి 'బాబుగారు అలా కాదు.. బాబుగారు ఇలా కాదు' అని డిఫెండ్ చేసుకోవడం.. నాగార్జున శివాజీకి వంతపాడటం. ఇక ప్రశాంత్-యావర్‌ని గుప్పిట్లో పెట్టుకుని, పనులన్నీ వీళ్లతో చేయించుకోవడం కూడా శివాజీ గేమ్ ప్లాన్‌లో భాగమేమో?
ఇక బిగ్‌బాస్‌లో శివాజీ మాటతీరు చాలా వరస్ట్! ఎందుకంటే హౌసులోని ప్రతిఒక్కరూ ఇతర కంటెస్టెంట్స్‌ని పేరు పెట్టి పిలవాలి. కానీ శివాజీ ఈ విషయంలో చాలా పూర్. కారణం లేకపోయినా సరే అమర్‌పై మొదటి నుంచే చాలా పగ పెంచేసుకున్నాడు. ప్రతివారం నామినేట్ చేసేవాడు. 'పనికిమాలినోడా', 'పిచ్చోడా' అని నోటికి ఏమొస్తే అలా పిలిచేవాడు. అమర్.. ఇవన్నీ పట్టించుకోడు కాబట్టి లైట్ తీసుకున్నాడు. గౌతమ్ లేదా అర్జున్‌ని ఇలా గానీ పిలుచుంటే శివాజీకి ఇచ్చిపడేసేవాళ్లు.
(ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!)
శివాజీలో ఇంకో అవలక్షణం ఏంటంటే.. ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. మిగతా లేడీ కంటెస్టెంట్స్.. తన మాటకు ఎదురుచెప్పలేదు. దీంతో వాళ్లని అమ్మ అమ్మ అని పిలిచేవాడు. వాళ్లని ఏం అనేవాడు కూడా కాదు. కానీ శోభా-ప్రియాంక.. శివాజీ నిజస్వరూపాన్ని ఉన్నది ఉన్నది చెప్పేవారు. మాటకు మాట కౌంటర్ ఇచ్చేవారు. ఇది శివాజీ అస్సలు తీసుకోలేకపోయాడు. 'ఒక్కటి పీకుతా', 'పీక మీద కాలేసి తొక్కుతా' లాంటి పిచ్చికూతులన్నీ కూసి, షో పరువు తీశాడు. మళ్లీ ఏమైనా అంటే.. మాది పల్నాడు, మా దగ్గర ఇలానే మాట్లాడుతారని చెప్పి పుట్టిన ఊరిపేరు కూడా చెడగొట్టాడు.
బిగ్‌బాస్ షోలోకి వచ్చిన మొదటి వారాల్లోనే శివాజీ కుడి చేతికి గాయమైంది. దీంతో చాలా గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయలేదు. కొన్ని గేమ్స్‌లో కనీస పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేశాడు. ఏమన్నా అంటే డిస్ట్రబ్ చేశావ్ అదీ ఇదీ అని అవతల వాళ్లపై అరిచేవాడు. ఈ సీజన్ మొత్తంలో పవరస్త్ర గెలుచుకోవడం, కెప్టెన్ కావడం (ఇంటి సభ్యుల సహకారంతోనే) తప్పితే చెప్పుకోదగ్గ ఘనత శివాజీకి ఒక్కటీ లేదు. ఇక ఫినాలేకి కొన్ని రోజులు ఉందనగా హోస్ట్ నాగార్జునతోనే పిచ్చి వాదనకు దిగాడు. ఇలా బోలెడన్ని కారణాల దృష్ట్యా.. శివాజీని నిర్వహకులు విన్నర్ కాదు కదా కనీసం రన్నరప్ కూడా చేయలేదు. పొరపాటున శివాజీ గానీ విన్నర్ అయ్యింటే మాత్రం అంతకంటే విచిత్రం మరొకటి ఉండేది కాదు. ఓవరాల్‌గా చూసుకంటే.. షోలో పార్టిసిపేట్ చేయడం, రెమ్యునరేషన్ తీసుకోవడం అనే సంతృప్తి తప్పితే శివాజీకి ఇంకేం మిగల్లేదు!
(ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్‌దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం)
Comments
Please login to add a commentAdd a comment