బిగ్‌బాస్ 7 నుంచి డాక్టర్‌బాబు ఎలిమినేట్ అయిపోయాడు. అశ్వద్ధామ 2.0 అని హడావుడి చేసిన ఇతడు.. సింగిల్‌గా ఆడుతూనే 13వ వారం వరకు నెట్టుకొచ్చేశాడు. అయితే ఇతడు చేసిన కొన్ని పనులు, అలానే హౌసులోని పలువురి వల్ల గౌతమ్.. బయటకొచ్చేసినట్లు అనిపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే.. ఇన్నివారాలకు కలిపి రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా ముట్టినట్లు టాక్. ఇంతకీ ఏంటి విషయం?
డాక్టర్‌బాబు ఫెర్ఫార్మెన్స్ ఓకే
డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్ హౌస్‌లో 13వ వారాలైతే ఉన్నాడు గానీ గుర్తింపు అయితే పెద్దగా తెచ్చుకోలేకపోయాడు. మొదటి వారం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు. ఈ విషయంలో మాత్రం అతడిని మెచ్చుకోవచ్చు. ఇన్ని వారాలు జరిగిన గేమ్స్‌లోనూ గౌతమ్ గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఓ రోజు సీక్రెట్ రూంలో ఉండొచ్చి, 'అశ్వద్ధామ 2.0' అని హడావుడి చేశాడు గానీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.
(ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?)
ఎలిమినేషన్‌కి అదే కారణమా?
ప్రారంభంలో నామమాత్రంగా ఆడిన గౌతమ్.. ఆ తర్వాత నుంచి శివాజీతో గొడవ పెట్టుకుని హైలైట్ అయ్యాడు. అప్పటి నుంచి తాజా వీకెండ్ ఎపిసోడ్ వరకు ఈ తంతే నడిచింది. అయితే శివాజీ వరస్ట్ కామందు తరహా ప్రవర్తన గురించి కాస్తో కూస్తో నిజాలు మాట్లాడిన వాళ్లలో గౌతమ్ ఒకడు. ఇదే ఇప్పుడు బిగ్‌బాస్ ఆర్గనైజర్స్‌కి నచ్చలేదు. గౌతమ్‌ని ఎలిమినేట్ చేసి పడేశారు. గత రెండు మూడు వారాల గేమ్ తీసుకుంటే శివాజీ, యావర్ కంటే గౌతమ్ చాలా బెటర్. కానీ శివాజీ మీద బిగ్‌బాసోళ్లకు ప్రేమ ఎక్కువైంది. అదే గౌతమ్‌కి శాపమైందని టాక్.
రెమ్యునరేషన్ ఎంత?
ఇకపోతే వారానికి రూ 1.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అని గౌతమ్ డీల్ మాట్లాడుకున్నాడట. అంటే 13 వారాలకు గానూ దాదాపు రూ 19.5 లక్షలు పారితోషికంగా అందుకున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై గౌతమ్ క్లారిటీ ఇస్తే తప్ప అసలు లెక్కలు తెలియవు. ఏదేమైనా శివాజీతో పెట్టుకోవడం తనకు ప్లస్ అవుతుందని గౌతమ్ అనుకున్నాడు కానీ అదే మైనస్ అయి, ఇంటి నుంచి బయటకొచ్చేలా చేసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: రానా తమ్ముడి డెస్టినేషన్ వెడ్డింగ్? ఆ దేశంలో మూడు రోజుల పాటు!)
Comments
Please login to add a commentAdd a comment