Bigg Boss 7: శివాజీకి షాకిచ్చిన బిగ్‌బాస్.. ఓట్లు పడినా ఈసారి వేటు గ్యారంటీ! | Bigg Boss 7 Telugu Sivaji In Danger Zone And Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Sivaji: బిగ్‌బాస్ ముందే హింట్ ఇచ్చాడు.. శివాజీకే బుర్ర పనిచేయలేదు!

Published Tue, Nov 28 2023 7:07 PM | Last Updated on Tue, Nov 28 2023 7:40 PM

 Bigg Boss 7 Telugu Sivaji In Danger Zone And Elimination - Sakshi

'బిగ్‌బాస్' షోలో శివాజీ ఆటలు ఇన్నిరోజులు సాగాయేమో కానీ ఇకపై మాత్రం నో ఛాన్స్. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ఇప్పటివరకు ఓట్లు పడితే సేవ్ అవుతూ వచ్చాడు. ఈసారి మాత్రం వేటు పడటం గ్యారంటీ అనిపిస్తుంది. మొన్నీమధ్యే శివాజీకి బిగ్‌బాస్.. వార్నింగ్ లాంటి హింట్‌ ఇచ్చాడు. కాకపోతే మనోడు అప్పుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు రియాలిటీలో అదంతా తెలిసి వస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?

శివాజీకి బుర్రపనిచేయలేదు
మొన్న వీకెండ్ ఎపిసోడ్‌లో భాగంగా భుజం సమస్య గురించి శివాజీని బిగ్‌బాస్ అడిగి తెలుసుకున్నాడు. నొప్పి ఎలా ఉందని అడుగుతూనే.. ఇకపై హౌస్‌లో ఉండాలనుకుంటున్నారా? వెళ్లిపోవాలనుకుంటున్నారా? అని చాలా పద్ధతిగా అడిగాడు. శివాజీ మాత్రం... ఉంటానని, వెళ్లిపోతానని రకానికి ఒకలా చెప్పాడు. చివరగా నాగార్జున సర్ది చెప్పడంతో.. కొనసాగుతానని అన్నాడు. అయితే అన్ని విషయాల్లో ముందు చూపుతో ఆలోచించే శివాజీ.. బిగ్‌బాస్ ఇచ్చిన హింట్‌ని సరిగా అర్థం చేసుకోలేక పప్పులో కాలేశాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే శివాజీకి బుర్రలేదని క్లియర్‌గా అర్థమైపోయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు)

శివాజీకి వరస షాక్‌లు
ఈవారం నామినేషన్స్ పూర్తయిపోయాయి. అమర్ తప్ప మిగతా ఏడుగురు లిస్టులో ఉన్నారు. అయితే ఈసారి కెప్టెన్సీ కోసం టాస్క్‌లు ఏం ఉండవని నాగ్ ముందే చెప్పాడుగా. దీనికి తగ్గట్లే 'టికెట్ టూ ఫినాలే' పోరు మొదలైంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోల ప్రకారం మూడు గేమ్స్ పెట్టగా.. శివాజీ అడ్డంగా దొరికిపోయాడు. ఏ ఒక్క దానిలోనూ కనీసం చివరివరకు వెళ్లలేకపోయాడు. ఇలా వరస షాక్‌లు తగిలాయి.  

వేటు పడటం గ్యారంటీ?
ప్రతివారం ఓట్లు పడితే నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోవచ్చు. ఇన్నాళ్లు ఇదే జరుగుతోంది. అయితే చివరి వారాల్లో ఓట్లు ఎక్కువ పడితే సరిపోదు. గేమ్స్‌లోనూ గెలవాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు గ్రూప్ గేమ్స్ కాబట్టి శివాజీ తన మాటలతో మేనేజ్ చేస్తూ బండి లాక్కొచ్చేశాడు. కానీ ఇప్పుడు జరిగేవన్నీ సింగిల్ గేమ్స్ కదా. శివాజీ పనితనం ఏంటో తేలుతుంది. ఒకవేళ టికెట్ టూ ఫినాలే పోటీలో గెలవకపోతే.. ఓటింగ్‌తో సంబంధం లేకుండా బయటకు పంపేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఫిజికల్ టాస్క్‌ల వల్ల భుజం నొప్పి తిరగబెడితే మాత్రం.. శివాజీ మిడ్ వీక్ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ ఎంగేజ్‌మెంట్.. కాబోయే భర్త ఎవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement