బిగ్‌బాస్‌ 7: ఎలిమినేషన్‌ రౌండ్‌.. శివాజీ వర్సెస్‌ శోభా! చివరకు.. | Bigg Boss 7 Telugu: Shobha Shetty Eliminated from BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: ఊహించిందే జరిగింది.. ఆ కంటెస్టెంట్‌ అవుట్‌..

Published Sun, Dec 10 2023 11:33 AM | Last Updated on Sun, Dec 10 2023 12:58 PM

Bigg Boss 7 Telugu: Shobha Shetty Eliminated from BB House - Sakshi

శోభా శెట్టి.. అన్నీ తన సొంతం కావాలనుకుంటుంది. ఏ టాస్క్‌ అయినా తనే గెలిచేయాలనుకుంటుంది. అందరూ తనకే సపోర్ట్‌ ఇవ్వాలనుకుంటుంది. పొరపాటున తనను కాదని పక్కవాళ్లకు మద్దతు ఇచ్చారంటే ఇక అంతే సంగతులు.. ఫినాలే దగ్గరపడుతున్నా తన పంతం మార్చుకోలేదు శోభ. చెప్పాలంటే ఈ వారం ఇంకా మొండిగా వ్యవహరించింది. స్నేహితులను కూడా విడిచిపెట్టలేదు. అటు స్పై బ్యాచ్‌తోనూ ఇటు తన ఫ్రెండ్స్‌తోనూ గొడవపడింది. 

ఊహించిందే నిజమైంది
ఓపక్క తనకు ఓట్లు పడుతున్నాయి, తాను వీక్‌ కాదంటూనే.. మరోపక్క ఈవారం వెళ్లిపోయేది తానేనంటూ రెండు మాటలు మాట్లాడింది. అటు ప్రేక్షకులు సైతం ఈ వారం ఇంటి నుంచి శోభాను బయటకు పంపించేయాలని డిసైడ్‌ అయ్యారు. చివరకు అందరి అంచనా నిజమైంది.. శోభా ఎలిమినేట్‌ అయింది. ఫినాలేకు అడుగు దూరంలోనే ఆమె బిగ్‌బాస్‌ జర్నీ ఆగిపోయింది. అయితే ఈసారి నామినేషన్‌లో ఉన్నవారిని సేవ్‌ చేసుకుంటూ రాలేదు నాగ్‌. ఫినాలే వీక్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఒక్కొక్కరి పేర్లు ప్రకటించాడు. అలా ప్రియాంక, ప్రశాంత్‌, అమర్‌, యావర్‌ ఫినాలేలో అడుగుపెట్టారు.

చివరి రౌండ్‌లో ఇద్దరు
అర్జున్‌ ఎలాగో ఫినాలే అస్త్ర గెలవడంతో ఈ వారం నామినేషన్‌లోనే లేడు. ఇక ఎలిమినేషన్‌ ప్రక్రియ మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లయిన శివాజీ, శోభ మధ్యే జరిగినట్లు తెలుస్తోంది. శివాజీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా తన సింపతీ గేమ్‌ వల్ల ఓట్లు పడుతున్నాయి. దీంతో అతడు ఎలిమినేట్‌ అయ్యే ఛాన్సే లేదు. ఇక శోభా శెట్టి సైకోలా మారిపోయి తన గేమ్‌ తానే చెడగొట్టుకుంది. దీంతో తాను తవ్వుకున్న గోతిలో తనే పడింది, ఈవారం ఎలిమినేట్‌ అయింది. మరి ఎలిమినేషన్‌ తర్వాత శోభా రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: శివాజీ బ్యాచ్‌ని ఉతికారేసిన నాగార్జున.. ఆ విషయమే కారణమా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement