మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ ఫినాలే అంటే హడావుడి ఎలా ఉండాలి. ఇంటి సభ్యులు గానీ ప్రేక్షకులు గానీ టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోవాలి. ఈ విషయంలో నిర్వహకులు పూర్తిగా చేతులెత్తేశారు. ఏం చేయాలో తెలీక ఏదేదో చేస్తూ ఫుల్ టైమ్ పాస్ చేస్తూ వచ్చారు. చివర్లో సూట్‌కేస్‌తో కాస్త సస్పెన్స్ క్రియేట్ చేయాలనుకున్నారు గానీ ఇందులోనూ సక్సెస్ కాలేకపోయారు. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 104 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
టైమ్‌పాస్ పల్లీ బఠాణీ
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ ఉంది కాబట్టి నాగార్జున శనివారం రాలేదు. ఇంట్లో ఉన్న ఆరుగురితోనే టైమ్ పాస్ చేయించాలని ఫిక్సయిన బిగ్‌బాస్.. చిన్నపిల్లల ఆటలన్నీ పెట్టాడు. కళ్లకు గంతలు కట్టుకుని ఎవరు కొట్టారో చెప్పుకోండి చూద్దాం అనే తరహాలో ఓ గేమ్ పెట్టాడు. ఇందులో ఏమంత ఫన్ క్రియేట్ కాలేదు. దీని తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లలా యాక్ట్ చేసి చూపించాలని బిగ్‌బాస్ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రైతుబిడ్డ ప్రశాంత్, అమర్‌లా యాక్ట్ చేసి చూపించిన అర్జున్.. అలానే కాఫీ ఇవ్వకపోతే బయటకెళ్లిపోతానంటూ శివాజీ చేసే హడావుడిని రీక్రియేట్ చేసిన ప్రియాంక.. ఫుల్ మార్కులు కొట్టేశారు. మిగతా నలుగురికి ఛాన్స్ రాలేదో, మరి వాళ్లు చేయలేదో తెలియలేదు.
శ్రీముఖి ఎంటర్‌టైనర్
ఇక త్వరలో ప్రారంభమయ్యే 'సూపర్ సింగర్' కొత్త సీజన్ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన 3వ సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి.. కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. 'ట్రూత్ ఆర్ డేర్' గేమ్ ఆడిపించింది. ఈ ఆటలో భాగంగా శివాజీని శ్రీముఖి ఓ ప్రశ్న అడగ్గా.. బయటకెళ్లిన తర్వాత నయని పావనితో బాండింగ్ పెంచుకుంటానని శివాజీ అన్నాడు. రతిక.. ఓసారి ఎలిమినేట్ అయి, హౌసులోకి తిరిగొచ్చినా సరే ఇంకా మెచ్యూరిటీ లెవల్స్ రాలేదని శివాజీ చెప్పాడు. అలానే మరో ప్రశ్నకు బదులిచ్చిన యావర్.. అశ్వినిని పెళ్లి చేసుకుంటా, రతికతో డేట్‌కి వెళ్తా, శుభశ్రీని కిల్ చేస్తానని నవ్వుతూ చెప్పాడు.
సూట్‌కేస్ గమ్
ప్రతి సీజన్‌లో ఉన్నట్లే ఫినాలేకి ఓ రోజు ముందు హౌసులోకి బిగ్‌బాస్ డబ్బుల సూట్‌కేస్ పంపించాడు. రూ.3 లక్షల మొత్తంతో వేలం పాట మొదలుపెట్టాడు. ఎవరు తీసుకుంటారంటూ ఒకరి తర్వాత మరొకరికి ఆఫర్ ఇచ్చాడు. రూ.3 లక్షల దగ్గర మొదలైన ఈ ఆఫర్.. వరసగా రూ.5 లక్షలు, రూ.8 లక్షలు, రూ.10 లక్షల వరకు వెళ్లింది. కానీ ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ మొత్తం మంచి టెంప్టింగ్‌గా ఉన్నప్పటికీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. అయితే ఈ వేలంపాట జరుగుతున్నప్పుడు మధ్యలో శివాజీ.. అర్జున్, అమర్‌తో చిన్న పిచ్చి డిస్కషన్ పెట్టాడు. ఎంత కావాలి? ఎంత కావాలి? అని అన్నాడు. తనకు రూ.40 లక్షలిస్తే పోతానని అర్జున్.. రూ.45 లక్షలైతే వెళ్లిపోతానని అమర్ అన్నాడు. ఇక చివరగా ప్రియాంకకు ఇంటి నుంచి ఫుడ్ రావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆదివారం ఫినాలే ఎపిసోడ్ సాయంత్రం 6 లేదా 7 గంటలకు మొదలయ్యే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment