
విజయవంతంగా దూసుకుపోతున్న బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5లో ఉంటారు? ఎవరు విజేతగా అవతరిస్తారు? అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ఫినాలేలో అందరి కంటే ముందు అడుగుపెట్టేందుకు బిగ్‌బాస్ ఫినాలే అస్త్రను ప్రవేశపెట్టాడు. ఇది గెలిచినవారు నేరుగా టాప్ 5కి చేరుకుంటారు.
ఇప్పటికే టికెట్ టు ఫినాలే మొదలైంది. ఇందులో భాగంగా పలు గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్‌బాస్. తొలి ఆటలో అర్జున్ గెలవగా రెండో టాస్క్‌లో ప్రశాంత్ గెలిచాడు. ఈరోజు హౌస్‌లో మరిన్ని టాస్కులు ఆడించాడు బిగ్‌బాస్. మూడో టాస్క్‌లో అర్జున్, నాలుగో టాస్కులో ప్రశాంత్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇచ్చిన మరో టాస్క్‌లో అమర్‌దీప్ విజేతగా నిలిచాడు. తక్కువ పాయింట్లు ఉన్నవారు ఒక్కొక్కరిగా రేసులో నుంచి అవుట్ అవుతున్నారు.
ఇప్పటివరకు శివాజీ, శోభతో పాటు ప్రియాంక సైతం గేమ్‌లో అవుట్ అయినట్లు తెలుస్తోంది. అయితే తన పాయింట్లను అమర్‌కు కాకుండా తన కెప్టెన్సీ కోసం పోరాడిన గౌతమ్‌కు ఇచ్చిందట! ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేసులో ప్రశాంత్, అర్జున్, అమర్‌దీప్, గౌతమ్, యావర్ ఉన్నారు. వీరిలో గౌతమ్ దగ్గర తక్కువ పాయింట్లు ఉన్నాయని టాక్! మరి ఫినాలే అస్త్ర ఎవరి సొంతమవుతుంది? ఎవరు టాప్ 5లో తొలుతగా చోటు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment