లాజిక్స్ మర్చిపోయిన శివాజీ.. అమర్ అడిగిన దానికి నో ఆన్సర్! | Bigg Boss 7 Telugu Day 57 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 57 Highlights: అమర్‌నే మళ్లీ మళ్లీ టార్గెట్ చేస్తున్న శివాజీ.. ఎందుకంత పగ?

Oct 30 2023 11:00 PM | Updated on Oct 31 2023 8:50 AM

Bigg Boss 7 Telugu Day 57 Episode Highlights - Sakshi

బిగ్ బాస్ నామినేషన్స్ ఈసారి మరీ అంత హోరాహోరీగా కానప్పటికీ ఇంట్రెస్టింగ్‌గానే సాగాయి. శివాజీ బ్యాచ్ అంతా సీరియల్ బ్యాచ్ ని మళ్లీ టార్గెట్ చేశారు. ఈరోజు అది మళ్లీ క్లియర్ అయిపోయింది. అలానే అమరదీప్ లాజిక్స్ మాట్లాడేసరికి శివాజీ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఇంతకీ సోమవారం నామినేషన్స్‌ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 57 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

లాజిక్ లెస్ నామినేషన్స్ 
సందీప్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. కంటెస్టెంట్స్ నిద్రలేవడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా గౌతమ్ బాధ్యతలు అందుకున్నాడు. తనకు డిప్యూటీలుగా రతిక, శోభాని ఎంచుకున్నాడు. ఈ వారమంతా ఉమెన్స్ వీక్ సందర్భంగా.. ఇంట్లోని అమ్మాయిలకు విశ్రాంతి అని, అబ్బాయిలే అన్ని పనులు చేయాలని కెప్టెన్ గౌతమ్ ఆర్డర్ వేశాడు. తర్వాత నామినేషన్స్ షురూ అయ్యాయి.

(ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?
ప్రశాంత్ - అమరదీప్, తేజ
ప్రియాంక - రతిక, భోలె
అర్జున్ - శోభా, అమరదీప్
శివాజీ - అమరదీప్, తేజ
రతిక - ప్రియాంక, శోభాశెట్టి
తేజ - అర్జున్, రతిక
భోలె - ప్రియాంక, అమరదీప్

రైతుబిడ్డ చల్లబడ్డాడు!
నామినేషన్స్ అంటే రెచ్చిపోయే రైతుబిడ్డ ప్రశాంత్ దగ్గర ఈసారి కారణాలు లేవు. దీంతో ఎప్పటిలానే తన బ్యాచ్‌కి వ్యతిరకమైన అమరదీప్‌ని నామినేట్ చేసిపడేశాడు. గతవారం మిర్చి దండ వేశాడని తేజని కూడా నామినేట్ చేశాడు. దీంతో తేజకి చిరాకేసింది. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసులో గెలిచిన వాళ్ల మధ్య గేమ్ పెట్టి, విజేతని డిసైడ్ చేయండి. వాళ్ల గురించి తమకు అప్పజెప్పి ఈ పంచాయతీలు పెట్టకండి బిగ్‌బాస్ అని తన డిసప్పాయింట్‌మెంట్ బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?)

శివాజీ పగ-ప్రతీకారం
బిగ్‌బాస్‌లో పెద్దగా పనులేం చేయకుండా, పెద్దమనిషిలా కలరింగ్ ఇస్తూ ప్రతివారం నెట్టుకొస్తున్న శివాజీ.. ఎప్పటిలానే ఈసారి కూడా అమరదీప్‌ని నామినేట్ చేశాడు. గతవారం నామినేషన్స్ సందర్భంగా అమరదీప్ గట్టిగట్టిగా అరవడం, డబుల్ మీనింగ్‌లో మాట్లాడటం నచ్చలేదని శివాజీ అన్నాడు. మరి ప్రశాంత్ ఇలా అరిచాడు కదా అప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదన్న? అని అమరదీప్, శివాజీని ప్రశ్నించాడు. వాడికి చాలాసార్లు చెప్పాను, మార్చుకున్నాడని శివాజీ అన్నాడు. ఇక్కడ శివాజీ.. పుత్రప్రేమ క్లియర్‌గా బయపడింది. 

ఇక ప్రియాంక.. గేమ్ కనిపించలేదని రతికని నామినేట్ చేసింది. కానీ రతిక మాత్రం ప్రియాంక తనని చేసింది కదా అని ఆమెని నామినేట్ చేసి పడేసింది. అలా ఎంతో సీరియస్‌గా సాగుతున్న ఈ ప్రక్రియలో తేజ కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ఓవరాల్‌గా చూస్తే శివాజీ బ్యాచ్‌కి చెందిన శివాజీ, ప్రశాంత్, భోలె.. కావాలని టార్గెట్ చేసి మరీ అమరదీప్ ని నామినేట్ చేయడం.. గ్రూపుల యవ్వారాన్ని మొత్తం బయటపెట్టినట్లయింది. అలానే అమర్ అంటే శివాజీకి ఎందుకంత పగ అనేది అర్థం కావట్లేదు.

(ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement