సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి | Bigg Boss 7 Telugu Shobha Shetty Engagement Pics Viral | Sakshi
Sakshi News home page

Shobha Shetty Engagement: నెలరోజుల క్రితం ప్రియుడ్ని పరిచయం చేసి.. ఇప్పుడేమో పెళ్లికి రెడీ!

Published Mon, Jan 22 2024 4:26 PM | Last Updated on Mon, Jan 22 2024 6:53 PM

Bigg Boss 7 Telugu Shobha Shetty Engagement Pics Viral - Sakshi

బిగ్‌బాస్ 7 ఫేమ్ శోభాశెట్టి ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. సరిగ్గా ఓ రెండు నెలల క్రితం ఇదే షోలో ప్రియుడిని పరిచయం చేసింది. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అలానే త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. ఇంతకీ ఈ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరిగింది? శోభాశెట్టి దీని గురించి ఏం చెప్పిందనేది ఇప్పుడు చూద్దాం.

కన్నడ బ్యూటీ శోభాశెట్టి.. 'కార్తీకదీపం' సీరియల్‌లో మోనిత అనే విలన్ పాత్రతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ప్రతి తెలుగింటిలోనూ ఈమెకు అభిమానులు ఉండొచ్చు. నటిగా అలా అదరగొట్టేసింది. ఇక గతేడాది జరిగిన బిగ్‌బాస్ 7వ సీజన్‌లో పాల్గొని దాదాపు చివరివరకు వచ్చేసింది. శివాజీ అండ్ గ్యాంగ్‌కి తన మాటలతో చుక్కలు చూపించింది. చాలామంది ఈమెని విమర్శించారు కానీ శివాజీ లాంటి వాళ్లతో పోలిస్తే శోభా చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్‌పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!)

ఇకపోతే ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని పరిచయం చేసింది. శోభా-యశ్వంత్.. ఇదే 'కార్తీకదీపం' సీరియల్‌లో కలిసి నటించారు. షార్ట్ ఫిల్మ్స్‌లోనూ యాక్ట్ చేశారు. అలా పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. అయితే గతేడాది వీళ్ల నిశ్చితార్థం జరగాల్సింది కానీ ఎందుకో క్యాన్సిల్ అయిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా శోభాశెట్టిని ఇప్పుడు బయటపెట్టింది. 

తాజాగా బెంగళూరులోని శోభాశెట్టి ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. యశ్వంత్-శోభా దండలు మార్చుకున్నాడు. అయితే ఇది నిశ్చితార్థ వేడుక అని వీడియోలో శోభాశెట్టి ఎక్కడ చెప్పలేదు. తర్వాత వీడియోలో దీని గురించి చెబుతానని దాటవేసింది. త్వరలో పెళ్లి డేట్ కూడా చెప్పేస్తుందేమో?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement