Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా? | Bigg Boss 7 Telugu: Shobha Shetty Boyfriend Details | Sakshi
Sakshi News home page

Shobha Shetty: బిగ్‌బాస్‌లో శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్‌.. అనేళ్లుగా ఇద్దరూ ప్రేమలో!

Published Sun, Nov 12 2023 6:53 PM | Last Updated on Mon, Nov 13 2023 9:06 AM

Shobha Shetty Boyfriend Details Bigg Boss 7 Telugu - Sakshi

బిగ్‌బాస్ షో అంటే ఎప్పుడూ గొడవలే కాదు సర్‌ప్రైజులు కూడా ఉంటాయి. గత కొన్నిరోజులుగా హౌసులో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ అందరి ఫ్యామిలీలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌసులోకి వచ్చి, కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఇదంతా పక్కనబెడితే దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో మాత్రం శోభాశెట్టి లవర్‌ని ఆమె చెప్పకుండా స్టేజీపై తీసుకొచ్చి షాకిచ్చారు.

శోభాశెట్టికి షాక్
ఫ్యామిలీ వీక్‌లో భాగంగా శోభాశెట్టిని కలవడానికి హౌసులోకి ఆమె తల్లి రత్నమ్మ వచ్చింది. కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది. ఇప్పుడు దీపావళి ఎపిసోడ్‌లో మాత్రం శోభాశెట్టి తండ్రితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ వచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోతో ఈ సంగతి బయటపడింది. అయితే తన ప్రేమికుడిని స్టేజీపై అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని శోభా షాక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!)

కుర్రాడు ఎవరో తెలుసా?
శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ పేరు యశ్వంత్. ఇతడు కూడా నటుడే. ఏ 'కార్తీకదీపం'లో మోనితగా శోభాశెట్టి బోలెడంత క్రేజ్ తెచ్చుకుందో అదే సీరియల్‌లో డాక్టర్‌బాబు పాత్ర తమ్ముడు ఆదిత్యగా యశ్వంత్ యాక్ట్ చేశాడు. కలిసి నటిస్తున్నప్పుడు స్నేహితులుగా ఉన్న వీళ్లు కొన్నాళ్లకు ప్రేమికులుగా మరో స్టెప్ వేశారు.

అయితే తన ప్రేమ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. దాదాపు మూడన్నరేళ్ల నుంచి లవ్‌స్టోరీ చాలా రహస్యంగా మెంటైన్ చేస్తూ శోభా వచ్చింది. గతంలో శోభా-యశ్వంత్ 'బుజ్జి బంగారం' అని ఓ సినిమా చేశారు. అప్పుడు కూడా జంట బాగుందన‍్నారు కానీ వీళ్ల కాంబో ప్రేమలో ఉందని కనిపెట్టలేకపోయారు. కానీ బిగ్‌బాస్ నిర్వహకులు ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని.. ఏకంగా దీపావళి ఎపిసోడ్‌కి తీసుకొచ్చి శోభాశెట్టి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: శివాజీని తిట్టడానికే భయపడుతున్న నాగ్.. మరీ ఇలా అయితే ఎలా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement