బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. కొందరిపై కోప్పడ్డాడు. మరికొందరిని మాత్రం బుజ్జగించాడు. ఇంకొందరిని మెచ్చుకున్నాడు. మరీ తీసిపడేయలేం కానీ ఓ మాదిరి ఇంట్రెస్టింగ్‌గానే శనివారం ఎపిసోడ్ సాగింది. సీరియల్ బ్యాచ్‌పై ఫుల్ సీరియస్ అయిన నాగ్.. శివాజీతో పవర్తించిన తీరు మాత్రం కాస్త విచిత్రంగా అనిపించింది. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 55 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
పిచ్చోడు గొడవ గురించి
గౌతమ్.. కొత్త కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. నాగ్ రావడంతో శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. శుక్రవారం జరిగిన సంగతుల్ని కాసేపు చూసిన నాగ్.. వర్తమానానికి వచ్చేశాడు. ఫస్ట్ ఫస్ట్ శోభాశెట్టితో మొదలుపెట్టాడు. అసలు యవర్‌ని 'పిచ్చోడు' అని ఎందుకు అన్నావ్? అని అడిగాడు. అనర్హత పేరు చెప్పి తనకు మిర్చి దండ వేశాడని, నేను మాట్లాడటానికి ట్రై చేస్తుంటే.. తనని మాట్లాడనివ్వలేదని, అందుకే పిచ్చోడు అని అన్నానని శోభా చెప్పుకొచ్చింది. మరి గతవారం భోలె.. ఎర్రగడ్డ అనే పదం వాడితే గింజుకున్నావ్, అది మెంటల్ అని అన్నావ్, ఒప్పుకోనని అన్నావ్.. ఇప్పుడెందుకు ఇలా చేశావ్ అని నాగ్ సీరియస్ అయ్యాడు. 'నీకు క్షమించే గుణం లేనప్పుడు మాటలు జారకూడదు కదమ్మా' అని సుతిమెత్తగా కౌంటర్ వేశాడు.
(ఇదీ చదవండి: 60 ఏళ్ల వయసులో హీరోలకు మించిన ఫాలోయింగ్.. ఎవరీ 'నెపోలియన్'?)
యవర్ కూడా పడ్డాయ్
ఈ గొడవలో శోభాది ఎంత గొడవ ఉందో యవర్‌ది కూడా అంతే తప్పు ఉందన్నట్లు నాగ్ చెప్పుకొచ్చాడు. మిర్చిదండ విసిరి కొట్టావ్, బిగ్‌బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశావ్.. మారావ్ అనుకుంటే.. మళ్లీ ముందులానే ప్రవర్తించావ్ యవర్ అని మనోడికి కాస్త గడ్డిపెట్టాడు. 'నువ్వు ప్రవర్తించిన విధానం చూస్తే.. నేను, ఆడియెన్స్ ఎవరైనా సరే పిచ్చోడు అనే అంటారు' కదా అన్నాడు. అయితే యవర్, శోభా.. ఇద్దరూ కూడా తమని తాము సమర్థించుకోవాలని చూశారు. ఇలా మిమ్మల్ని మీరు జస్టిఫై చేయాలని చూడకండి, ఫూల్ అవుతారు అని నాగ్ కౌంటర్ వేశాడు.
అమర్ vs ప్రశాంత్ గొడవ
నామినేషన్స్ సందర్భంగా ప్రశాంత్‌తో మాట్లాడుతూ అమరదీప్ కుర్చీ తన్నాడు. 'ఈ నా కొడుకు' అనే పదం వాడటం గురించి నాగ్ అడిగాడు. అమర్ ఏదో చెప్పాలని చూశాడు కానీ వర్కౌట్ కాలేదు. దీంతో నాగ్ మాట్లాడుతూ.. 'ప్రశాంత్ అంటే నీకు చిన్నచూపు అని అంటాటు' అని నాగ్ అనగానే.. 'లేదు సర్ లేదు సర్' అని అమర్ క్లారిటీ ఇచ్చాడు. అక్కడితో ఆ టాపిక్ ముగిసింది. ఇక నామినేషన్స్ లో ఒకలా, మిగతా సమయాల్లో మరోలా ప్రవర్తిస్తుంటావ్? ఏంటి ప్రశాంత్ ఇది అని నాగ్.. కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ఇక రతిక గురించి మాట్లాడిన నాగార్జున.. 'హౌసులో కబుర్లు చెప్పడానికి వెళ్లావా? గతం గతహ... అంత ఛాన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావ్? ఎందుకు ఆడట్లేదు? నామినేషన్స్‌లో లేవని కాన్ఫిడెన్సా? గతం గురించి మాట్లాడుకుంటే గతంలో ఉండిపోతావ్, మనుషుల గురించి ఫోకస్ చేయొద్దు' అని రతికకు సుతిమెత్తగా నాగ్ కౌంటర్స్ వేశాడు.
(ఇదీ చదవండి: నటుడి ఇంట్లో దొంగతనం.. డబ్బులు, బంగారంతో పనిమనిషి పరార్!)
శివాజీకి బుజ్జగింపులు
'ఎవరో ఒకర్ని కొట్టేసి వెళ్లిపోతా?' అన్నావ్ కదా శివాజీ అసలేమైంది? అని నాగ్ అడిగాడు. 'నేను అవన్నీ చెప్పుకోలేను. చాలా విషయాలు బాగోట్లేదు. నేను నీతిగానే ఉంటున్నాను. మనుషుల పేర్లు చెప్పలేని గానీ చాలామంది ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటోంది. నన్ను పంపించేశానా? నన్ను తిట్టినా ఓకే?' అని శివాజీ నాగార్జునతో అన్నాడు. ప్రశాంత్, యవర్‌కి వాళ్ల బిహేవియర్ గురించి చెప్పావా? అని నాగ్ అడగ్గా.. వీళ్లతో పాటు సందీప్‌కి కూడా చెప్పానని శివాజీ అన్నాడు. దీని తర్వాత నాగ్ మాట్లాడుతూ.. 'శివాజీ సేఫ్ ఆడొద్దు. నీకు ఏమనిపిస్తే అది చెప్పు' అని నాగ్ అన్నాడు. 'ఇదే చివరి అవకాశం.. ఇక చేయి దాటిపోతే చెప్పేస్తా బాబుగారు' అంటూ నాగ్-శివాజీ ఇద్దరికి ఇద్దరూ బుజ్జగించుకున్నట్లు అనిపించింది.
అయితే శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత హోస్ట్ నాగార్జున.. సీరియల్ బ్యాచ్ ని ఏమైనా టార్గెట్ చేశాడా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే శోభాశెట్టి, అమరదీప్‌తో గట్టిగా మాట్లాడిన నాగ్.. ఎవడో ఒకడ్ని కొట్టేసి వెళ్లిపోతా అని ఎగిరెగిరి పడిన శివాజీతో మాత్రం నాగ్ బుజ్జగింపులు జరిపాడు. అలా అనొద్దు, సేఫ్ ఆడొద్దు అని చెప్పాడు. అలానే ఈ ఎపిసోడ్ చూస్తే.. సీరియల్ బ్యాచ్ ఓవైపు, శివాజీకి ఓ బ్యాచ్ ఉందని క్లియర్‌గా అర్థమైంది. ఇకపోతే నామినేషన్స్‌లో ఉన్న 8 మందిలో ప్రియాంక, గౌతమ్ సేవ్ అయినట్లు నాగ్ చెప్పాడు. ఇంకా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆదివారం క్లారిటీ వస్తుంది. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?)
Comments
Please login to add a commentAdd a comment