బిగ్‌బాస్‌లో శివాజీ ఉండలేకపోతున్నాడు. గత ఆరువారాల నుంచి ఏదో మాటలు, మరోవైపు మైండ్ గేమ్‌తో నెట్టుకొచ్చేశాడు గానీ ఇప్పుడు వాటికి కూడా స్కోప్ లేకుండా పోయింది. ఓ విషయాన్ని తాను చేస్తే ఘనకార్యం అనుకుంటాడు. పక్కనోళ్లు చేస్తే మాత్రం నాన్సెన్స్ అంటున్నాడు. అమరదీప్‌తో జరిగిన ఓ సంఘటనతో ఇది బయటపడింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 47 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్.. ఏడోవారం కూడా అమ్మాయే?)
శివాజీపై బిగ్‌బాస్ ప్రేమ
కెప్టెన్సీ టాస్క్ పూర్తి కావడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. కెప్టెన్సీ టాస్కులో విజేతని ప్రకటించడంతో శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. టాస్కులో విజయం సాధించిన జిలేబీపురం గ్రామస్థులు కెప్టెన్సీ కంటెండర్స్‌గా నిలిచారు. అయితే సంచాలక్‌గా వ్యవహరించిన శివాజీకి కూడా ఛాన్స్ ఉందని, కాకపోతే గెలిచిన జట్టులో ఒకరితో ఎక్సేంజ్ చేసుకోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో భోలె.. తన కంటెండర్‌షిప్ శివాజీకి దానం చేశాడు.
కొత్త కెప్టెన్ ఎవరు?
కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం పోటీలో ఉన్న ఆరుగురిలో (ప్రియాంక, అర్జున్, సందీప్, ప్రశాంత్, అశ్విని, శివాజీ) ఎవరు కెప్టెన్ కావాలనేది ప్రత్యర్థి జట్టు గులాబీపురం చేతిలో ఉంటుందని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో శోభా వచ్చి అశ్వినిని ఎలిమినేట్ చేసింది. అమరదీప్.. శివాజీని ఎలిమినేట్ చేశాడు. పూజామూర్తి.. ప్రశాంత్‌ని ఎలిమినేట్ చేసింది. యవర్.. ప్రియాంకని ఎలిమినేట్ చేశాడు. ఫైనల్‌గా అర్జున్, సందీప్.. కెప్టెన్సీ కోసం పోటీపడబోతున్నారు.
(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్)
శివాజీ అసహనం
బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఎన్ని వారాలు, ఎలాంటి టాస్కులైనా సరే అన్నింటికి తట్టుకుని నిలబడాలి. ఈ క్రమంలోనే విజయం సాధించొచ్చు లేదంటే అక్కడివరకు వచ్చామనే ఆనందంతోనైనా బయటకెళ్లొచ్చు. తొలి కొన్నివారాలు మాటలు చెప్పుకొని శివాజీ మంచిగా బండి లాక్కోచేశాడు గానీ ఇప్పుడు శరీరంలోని సహనం అంతా పోయింది. దీంతో నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా అమరదీప్ శివాజీని నామినేట్ చేసి ఎలిమినేట్ చేసేశాడు. దీంతో శివాజీ.. 'నేనో వేస్ట్ కేండిడేట్‌లా కనిపిస్తున్నా. నేను ఈ హౌసులో పనికిరాను. నాకు ఈ హౌస్ వద్దు, నువ్వు(బిగ్‌బాస్) వద్దు, తలుపు తీస్తే నేను వెళ్లిపోతా' అని ఏది పడితే అది మాట్లాడాడు.
లాజిక్ మర్చిపోయిన శివాజీ
అయితే ఐదోవారమే కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చినా దాన్ని ప్రశాంత్ కోసం శివాజీ త్యాగం చేశాడు. అప్పుడేమో పెద్ద త్యాగమూర్తిలా నీతులు చెప్పాడు. ఇప్పుడు అమరదీప్.. తనని సైడ్ చేసేసరికి బుర్ర బాదుకున్నాడు. ఈ విషయమై అమర్, సందీప్‌తో మాట్లాడుతూ కరెక్ట్ లాజిక్ చెప్పాడు. 'ఆయనకు వాళ్లు(ప్రశాంత్, యవర్) ఎంత ముఖ్యమో నాకు నా వాళ్లు అంతే ఇంపార్టెంట్ కదా?' అని అమరదీప్ అన్నాడు. అప్పుడేమో శివాజీ, ప్రశాంత్‌కి కెప్టెన్సీ వచ్చేలా చేయొచ్చు. ఇప్పుడు మాత్రం అమర్.. తన వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వాలని చూసేసరికి శివాజీకి ఎక్కడలేని కోపమొచ్చేసింది. ఇదెక్కడి లాజిక్కో శివాజీకే అర్థం కావాలి. తీరా కాసేపటి తర్వాత అమర్‌తో అనరాని మాటలు అన్నాడు. 'నేను చచ్చిపోయేటప్పుడు కూడా నా పిల్లలకు నిన్ను నమ్మొద్దని చెబుతాను' అని శివాజీ తనతో అన్నట్లు అమర్, శోభా దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. మరో సందర్భంలో శివాజీ, తేజతో మాట్లాడుతూ శోభా వెనక తిరగడంపై అతడికి క్లాస్ పీకాడు.
(ఇదీ చదవండి: అబ్బ.. ఏం డ్రామా శివాజీ.. అమర్‌దీప్‌పై అంత పగ దేనికి?)
వెళ్లిపోతానని ఒకటే గోల
ఇదే ఎపిసోడ్‌లో శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్‌బాస్... ఎలా ఉన్నారు? అని అడిగాడు. దీంతో శివాజీ జరిగిదంతా చెప్పాడు. 'చాలా ఇబ్బంది పడుతున్నా, చెయ్యంతా లాగుతుంది, నన్ను బయటకు పంపేయ్ బిగ్‌బాస్.. రోజు ఏడుస్తున్నా, ఎవరైనా ఉంటే నవ్వుతూ ఏడుస్తున్నా, ఇలా పిల్లలతో మాటలు పడటం కావట్లేదు. అన్ని ఉన్నాయ్ కానీ న్యాయం చేయలేకపోతున్నా, చాలా ఆశలతో ఇక్కడికి వచ్చా కానీ టైం పడతది బిగ్‌బాస్.. తెలుస్తుంది నా బాడీ నాకు కోపరేట్ చేయట్లేదని, అమరదీప్ చెప్పింది కరెక్టే, నేను వెళ్తా బిగ్‌బాస్.. వాళ్లందరి ముందు ఏడవలేకపోతున్నా. నాకు చాలా బరువుగా ఉంది. నేనుంటే కప్ కొడతానని నాకు తెలుసు. కప్పు కొడదామనే వచ్చా. మంచిగా ప్రారంభించినా, ఇప్పుడు పరిస్థితులు నాకు సహకరించట్లేదు. మీతో మాట్లాడుతుంటే కూడా నొప్పిగా ఉంది, కానీ దీన్నంతా కవర్ చేసుకుని అక్కడ నవ్వుతూ మాట్లాడుతున్నా' అని ఎమోషనల్ అయ్యాడు. అయితే మరోసారి డాక్టర్‌కి చూపించిన తర్వాత చూద్దాం అని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు.
శివాజీని ఎందుకు ఉంచుతున్నట్లు?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఫిజికల్ టాస్కుల పరంగా శివాజీ ఒక్కటి ఆడట్లేదు. ఓసారి ఆడిన దానికే చెయ్యికి దెబ్బ తగిలింది. ఇప్పటికీ నొప్పితే విలవిల్లాడిపోతున్నాడు. అలానే ఇప్పటికే 10-15 సార్లు కంటే ఎక్కువగానే.. బయటకెళ్లిపోతా బయటకెళ్లిపోతా అని చెబుతున్నాడు. ఇంత చెబుతున్నాడు. ఇంతలా పోతా పోతా అని అంటున్నా సరే బిగ్‌బాస్, శివాజీపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడనేది అర్థం కాని ప్రశ్నలా మారిపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఈసారి ఆదివారం కాకుండా శనివారం ఎలిమినేషన్ ఉందంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు)
Comments
Please login to add a commentAdd a comment