Bigg Boss 7: మళ్లీ దొరికిపోయిన శివాజీ.. అమర్ ఆ పాయింట్ చెప్పేసరికి! | Bigg Boss 7 Telugu Day 51 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 51 Highlights: రైతుబిడ్డ ప్రశాంత్.. గ్రూపుల గురించి బయటపెట్టాడు!

Published Tue, Oct 24 2023 11:10 PM | Last Updated on Wed, Oct 25 2023 8:59 AM

Bigg Boss 7 Telugu Day 51 Episode Highlights - Sakshi

బిగ్‌బాస్‌లో మిగతా వాటి సంగతెలా ఉన్నా నామినేషన్స్ మాత్రం మంచి మజా ఇస్తాయి. ఈసారి కూడా అలానే జరిగాయి. సోమవారం నాడు శోభాశెట్టి శివాజీ మీద రెచ్చిపోగా, మంగళవారం నాడు అమరదీప్ శివాజీపై రెచ్చిపోయాడు. ఎప్పుడూ హడావుడి చేసే రైతుబిడ్డ ఈసారి చల్లబడ్డాడు. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 51 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి:'జైలర్' విలన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?)

శివాజీ రంగు బయటపడింది
సోమవారం సగం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఇక మిగిలిన నామినేషన్స్‌తో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఫస్ట్ ఫస్ట్ వచ్చిన అమరదీప్ శివాజీని నామినేట్ చేశాడు. 'నేను చనిపోయేటప్పుడు కూడా నా పిల్లల్ని నీతో మాట్లాడొద్దని చెబుతాను' అని శివాజీ అనడం అస్సలు కరెక్ట్ కాదని అమరదీప్ అన్నాడు. అయితే ఇది జోక్‌గా అన్నానని శివాజీ ఏదో కవర్ చేశాడు. కానీ అమరదీప్ అలా అనేసరికి ముఖం మాడిపోయింది. కిందకు దించేసి అలా ఉండిపోయాడు. చివర్లో మాత్రం 'గుర్తులేదు, చూడలేదు, మర్చిపోయా.. దిస్ ఈజ్ మై ప్లాన్' అని శివాజీ అన్నాడు.

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?

  • అమరదీప్ - శివాజీ, భోలె
  • యవర్ - శోభాశెట్టి, సందీప్
  • తేజ - అశ్విని, సందీప్
  • ప్రశాంత్ - గౌతమ్, అమరదీప్
  • రతిక - శోభాశెట్టి, అమరదీప్
  • అర్జున్ - తేజ, భోలె

నోరు జారిన సందీప్
ఇక యవర్, సందీప్‌ని నామినేట్ చేశాడు. ఒకానొక దశలో సందీప్ సీరియస్ అయ్యాడు. యవర్‌ని ఉద్దేశిస్తూ.. 'బొంగులోది' అనే పదం ఉపయోగించడంతో పాటు చేతితో ఓ సైగ చేశాడు. దీంతో 'బొంగు' అనే పదాన్ని పదే పదే రిపీట్ చేశాడు. దీంతో ప్రతిసారి బిగ్ బాస్.. బీప్ వేసుకోవాల్సి వచ్చింది. ఈ గొడవ జరుగుతుంటే మధ్యలో వచ్చిన శివాజీకి కూడా సందీప్ గట్టిగా ఇచ్చేశాడు. 

(ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమాలో విలన్‌గా రామ్‌చరణ్ ఫ్రెండ్!)

ప్రశాంత్.. ఈసారి ఏం లే
మిగతారోజుల్లో ఉన్నాడో లేడో  అన్నట్లు ఉండే ప్రశాంత్.. నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం షర్ట్ పై బటన్ కూడా పెట్టుకుని బుద్దిమంతుడిలా రెడీ అవుతాడు. అవతల వాళ్లు చెప్పేది పూర్తికాకుండానే వాదిస్తుంటాడు. ఈసారి మాత్రం అంత సీన్ లేకపోయింది. గౌతమ్.. ప్రశాంత్ గాలి మొత్తం తీసేశాడు. తనని నామినేట్ చేయడంతో.. ప్రశాంత్ దగ్గర సరైన కారణం లేదు. రివేంజ్ నామినేషన్ చేస‍్తున్నాడని చెప్పాడు. ప్రశాంత్ ఎప్పుడూ చేసినట్లు గౌతమ్ బిహేవ్ చేస్తూ.. కరెక్ట్ గా చెప్పాలంటే అరుస్తూ డైలాగ్స్ చెబుతూ మరీ టీజ్ చేశాడు. దెబ్బకు ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు.

ఇక అమరదీప్‌ని కూడా నామినేట్ చేసిన ప్రశాంత్.. తమ గ్రూప్ సభ్యుడైన భోలె గురించి మాట్లాడటం నచ్చలేదని కారణం చెప్పాడు. దీంతో గ్రూప్ రాజకీయాలు బయటపడినట్లు అయింది. గ్రూపులో ఉన్న అతడిని కంట్రోల్ చేసుకోలేకపోయారని భోలె అనడంతో.. గ్రూప్ మెంబర్ అయిన శోభా రెచ్చిపోయింది. ఇంతలో అమరదీప్ చెవిలో గౌతమ్ ఏదో చెప్పాడని ప్రశాంత్ అనడంతో గౌతమ్ రెచ్చిపోయాడు. ఏదైనా చేసుకుంటా నువ్వేమైనా బిగ్ బాస్ వా దొబ్బెయ్ అని అమరదీప్, ప్రశాంత్‌తో అన్నాడు. నన్ను ఏకినా, పీకినా, లాగినా ఏం చేసుకున్నా వెనకడుగు వేయను. ఒక్కటి గుర్తుపెట్టుకో ఇక్కడి నుంచి పోతే కప్పుతోనే పోతా, ఎవ్వడు ఏమైనా చేసుకోండి అని అమరదీప్ గట్టిగా అరుస్తూ ప్రశాంత్‌తో చెప్పాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. మొత్తంగా ఈ వారం ఎనిమిది నామినేట్ అయ్యారు.

ఈ వారం నామినేట్ అయినోళ్లు

  • శోభా
  • భోలె
  • శివాజీ
  • అశ్విని
  • ప్రియాంక
  • అమరదీప్
  • సందీప్
  • గౌతమ్

(ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement