ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ ఏడో సీజన్ ప్రసారమవుతోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తయ్యాయి. మరీ అంతా సూపర్ అని చెప్పలేం కానీ ఓ మాదిరిగా అలరిస్తుంది. 'ఉల్టా పుల్టా' ట్యాగ్ లైన్‌తో జరుగుతున్న ఈ షోలో కొత్త కెప్టెన్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. షో చూస్తున్న ఆడవాళ్ల మనసులు గెలుచుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగింది?
బిగ్‌బాస్ షోలో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే నామినేషన్స్ రోజు మాత్రం వేరే లెవల్ హడావుడి ఉంటుంది. ఈ సోమవారం అలానే మంచి హీటెక్కించే వాదనలు జరిగాయి. అంతకంటే ముందు కొత్త కెప్టెన్‌గా గౌతమ్ కృష్ణ బాధ్యతలు అందుకున్నాడు. తనకు డిప్యూటీలుగా హౌసులోని లేడీ కంటెస్టెంట్స్ రతిక, శోభాని ఎంచుకున్నాడు. దీని తర్వాత ఓ నిర్ణయంతో మార్కులు కొట్టేశాడు.
(ఇదీ చదవండి: మంచానికే పరిమితమైన స్టార్ డైరెక్టర్ భార్యకు ప్రభుత్వ సాయం)
'ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఎన్నో రకాలు పనులు చేస్తుంటారు. ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో వాళ్లదే పైచేయి. ప్రతి ఇంట్లో ఉన్న, ఇక్కడున్న, టీవీల్లో చూస్తున్న ఆడవాళ్లకు గౌరవంగా మన బిగ్‌బాస్ హౌసులో ఈ వారం ఫీమేక్ వీక్ (ఆడవాళ్ల వారం) జరుపుకొందాం. ఇందుకోసం ఈ వారమంతా లేడీస్‌కి హాలీడే ఇస్తున్నాను' అని గౌతమ్ చెప్పుకొచ్చాడు. ఇదే గేమ్ ప్లానులో భాగమై ఉండొచ్చు గానీ ఏ భాషలో తీసుకున్నా సరే బిగ్‌బాస్ ఇలాంటి నిర్ణయం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలుస్తోంది.
దీనితో పాటే కెప్టెన్ గౌతమ్ మరో ఊహించని మరో నిర్ణయం తీసుకున్నాడు. 'ప్రతిరోజూ లైట్స్ ఆపేసిన తర్వాత ఆ రోజు చేసిన పని గురించి నిర్ణయం ఉంటుంది. ఇంట్లో ఎవరు ఎక్కువ కష్టపడ్డారో వాళ్లకు కష్ట జీవి.. తక్కువ పనిచేసిన వాళ్లకు పనిదొంగ అని బిరుదులు ఇస్తాం. కష్ట జీవికి ఒక డ్రింక్ ఇస్తాను. అలాగే పనిదొంగ తన రెండు గుడ్లను కూడా తిరిగిచ్చేయాలి' అని కెప్టెన్ గౌతమ్ చెప్పాడు.
(ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!)
Comments
Please login to add a commentAdd a comment