బిగ్‌బాస్ కొత్త కెప్టెన్ యవర్ యాటిట్యూడ్ వల్ల మిగితా ఇంటి సభ్యులు ఇబ్బందిపడ్డారు. దీని గురించి నాగ్ అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. అలానే హౌసులో బ్రెయిన్‌లెస్, యూజ్‌లెస్ ఎవరో తెలిసిపోయింది. మరోవైపు గత మూడు వారాల్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ని తీసుకొచ్చిన బిగ్‌బాస్ రీఎంట్రీ ప్లాన్ అని చెప్పాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 41 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
కొత్త కెప్టెన్ వల్ల గొడవ?
ప్రిన్స్ యవర్ బిగ్‌బాస్ హౌసుకి రెండో కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే శనివారం ఎపిసోడ్ మొదలైంది. వీఐపీ రూంలోకి వెళ్లి స్ప్రైట్ తీసుకునేందుకు అమర్ వెళ్లగా, కెప్టెన్ యవర్ ఇప్పుడు వద్దు తర్వాత ఇస్తానని అన్నాడు. మధ్యలో వచ్చిన సందీప్ బలైపోయాడు. యవర్ కోపానికి దొరికిపోయాడు. మధ్యలో వచ్చిన ప్రియాంకపై కూడా యవర్ సీరియస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కిస్ టఛాలెంజ్‌లో భాగంగా అమ్మాయిలు ముద్దు సింబల్‌ని కరెక్ట్‌గా గెస్ చేసిన తేజ.. శోభాతో డిన్నర్ డేట్ కి వెళ్లాడు. అక్కడ ఒకరికొకరు 'ఐ లవ్ యూ' చెప్పుకోవడం విశేషం.
(ఇదీ చదవండి: ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే బిగ్‌బాస్ నుంచి ఆమె ఎలిమినేట్!)
నాగ్ క్లాస్ పీకాడు కానీ?
ప్రోమోలో యవర్‌కి హోస్ట్ నాగార్జున ఏదో క్లాస్ పీకినట్లు చూపించారు. కానీ ఎపిసోడ్‌లో మాత్రం అలాంటిదేం లేదు. కెప్టెన్ ఏం చెబితే హౌసులో అదే రూల్. వీఐపీ రూంలో ఏది ఉంటే అది కెప్టెన్ జోన్‌లో ఉన్నట్లే. అతడి పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్లడానికి లేదు. స్ప్రైట్ తాగడానికి కూడా లేదని నాగ్.. అందరూ క్లారిటీ ఇచ్చాడు. అలా యవర్ చెప్పిన దానితో అంగీకరించాడు. ఇకపోతే ఈ వారం అమరదీప్.. గేమ్ పరంగా ఇంప్రూవ్ అయ్యావ్ అని నాగ్ మెచ్చుకున్నాడు.
రైతుబిడ్డు అర్థంపర్థం లేకుండా
తన కెప్టెన్సీ నుంచి కిచెన్ సెక్షన్, గౌతమ్‌కి ఇవ్వడంపై రైతుబిడ్డ ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. పుడ్ వేస్ట్ చేస్తున్నారని నాగార్జున దగ్గర చాడీలు చెప్పాడు. కానీ అది వేస్ట్ చేయడం కాదు, అటు ఇటు కావడంతో ఫ్రిడ్జ్‌లో పెట్టాం అని గౌతమ్, సందీప్, ప్రియాంక క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రశాంత్ తన కెప్టెన్సీ పోయిందని అర్థంపర్థం లేకుండా మాట్లాడినట్లు అనిపించింది.
(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!)
రీఎంట్రీ లాజిక్ లేని ట్విస్ట్
గత సీజన్లలోలానే ఈసారి గౌతమ్‌ని సీక్రెట్ రూంలో ఉంచి, హౌసులోకి రీఎంట్రీ ఇప్పించారు. అక్కడితో అందరూ అయిపోయిందనుకున్నారు. కానీ గత మూడు వారాల్లో ఎలిమినేట్ అయిన దామిని, రతిక, శుభశ్రీని తీసుకొచ్చి వీళ్లలో ఒకరు తిరిగి కంటెస్టెంట్ గా హౌసులోకి వచ్చే అవకాశముందని, అది హౌస్‌మేట్స్ చేతుల్లోనే ఉందని నాగార్జున షాకిచ్చాడు. దీంతో ఈ ముగ్గురు ఎవరికివారు.. తమని మళ్లీ ఎందుకు తీసుకోవాలో కంటెస్టెంట్స్ తో అప్పీలు చేసుకున్నారు. అయితే వీళ్లలో ఎవరు, ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారనేది ఆదివారం చెప్తానని నాగ్ క్లారిటీ ఇచ్చాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది.
అయితే బిగ్‌బాస్ ఓటింగ్ ప్రకారం తక్కువ ఓట్లు పడిన కారణంగానే రతిక, దామిని, శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు కదా. అంటే ప్రేక్షకులకు వీళ్ల ఆట నచ్చకే బయటకు పంపేశారు. అలాంటిది మళ్లీ వీళ్లనే తిరిగి హౌసులోకి తీసుకొస్తానని అనడం ప్రేక్షకుల ఓటింగ్ వేస్ట్ అని బిగ్‌బాస్ ఒప్పుకొన్నట్లేగా. ఇదే ఇప్పుడు విడ్డూరంగా అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఈమె తెలుగు సినిమాలు మాత్రమే చేసిన హీరోయిన్.. గుర్తుపట్టారా?)
Comments
Please login to add a commentAdd a comment