
బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు పది వారాలు పూర్తి కావస్తుంది. ఇక నుంచి బలమైన కంటెస్టెంట్లే హౌస్ నుంచి ఎలిమినేషన్ కానున్నారు. దీంతో ఆట రసవత్తరంగా మారనుంది. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులను హౌస్‌లోకి దింపుతున్నాడు బిగ్ బాస్. సాధారణంగా ప్రతి సీజన్‌లో సుమారు 12 వారంలో హౌస్‌లోకి కుటుంబ సభ్యులు వచ్చేవారు. ఇదీ ఉల్టాపుల్టా కదా అందుకే కొంచెం ముందుగానే ఈ ప్లాన్‌ను సెట్ చేశాడు బిగ్ బాస్.
హౌస్‌లో మిగిలిన 11 మంది కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం శివాజీ పెద్ద అబ్బాయి ఎంట్రీ ఇచ్చాడు. శివాజీకి రెగ్యులర్ హెల్త్ చెకప్‌లో భాగంగా అప్పుడప్పుడు డాక్టర్ రూమ్‌కు వెళ్తుంటాడు. అందులో భాగంగా ఆయన పెద్ద కుమారుడు శ్రీ మాస్క్‌తో పాటు కళ్లజోడు, కోట్ దరించి డాక్టర్ మాదిరి ఎంట్రీ ఇచ్చాడు.. సార్ మీ ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నిస్తాడు.. కానీ అక్కడికి వచ్చింది తన కుమారుడేనని గుర్తించని శివాజీ ఫర్వాలేదని చెప్పి తిరిగి వెళ్తున్న సమయంలో నాన్న... అంటూ శ్రీ పిలుస్తాడు. ఆ సమయంలో శివాజీ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు.
ఒక్కసారిగా తన బిడ్డను కౌగిలించుకున్న శివాజీ.. తర్వాత అందరికీ నా కుమారుడు అంటూ పరిచయం చేస్తాడు. ఆ సమయంలో అందరూ చాలా సంతోషంగా శ్రీ దగ్గరకు వచ్చి పలకరిస్తారు. బీటెక్ పూర్తి చేసుకున్న 'శ్రీ' మాస్టర్స్ కోసం అమెరికా వెళ్తున్నాడు. అన్నీ సెట్ అయితే మరో వారం లోపు ఆయన ప్రయాణం మొదలౌతుంది. ఇదే విషయాన్ని శివాజీకి కూడా శ్రీ తెలుపుతాడు. దీంతో వెళ్లె ముందు తన తండ్రిని శ్రీ ఇలా కలుసుకున్నాడు. బహుశా బిగ్ బాస్ కూడా ఈ విషయాన్ని గుర్తించే ఫ్యామిలీ వీక్‌ను రెండు వారాలు ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి అనుబంధాల విషయంలో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణాయాన్ని పలువురు అభినందిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment