Bigg Boss 7: అమర్‌కి ఎదురుదెబ్బలు.. మొన్న ప్రియాంక ఇప్పుడు శోభా! | Bigg Boss 7 Telugu Day 80 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 80 Highlights: శోభాతో అమర్‌దీప్ గొడవ.. ఇచ్చిన పని చేతకాక చివరకు అలా!

Published Wed, Nov 22 2023 10:36 PM | Last Updated on Thu, Nov 23 2023 8:32 AM

Bigg Boss 7 Telugu Day 80 Episode Highlights - Sakshi

బిగ్‌బాస్ షో నిర్వహకులు, హౌస్‌మేట్స్ ఇద్దరికి ఇద్దరూ అలానే తగలడ్డారు. లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే సరిగ్గా ఈ డైలాగే గుర్తొచ్చింది. ఎందుకంటే అందరూ ఫెర్ఫార్మ్ చేయమని.. బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. అందుకు తగ్గట్లే ఎంటర్‌టైన్ చేయాల్సింది పోయి అందరూ కలిసి చిరాకు కలిగేలా చేశారు. మరీ ముఖ్యంగా శోభా-అమర్‌దీప్ అయితే నస పెట్టారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 80 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

టాస్క్ ఓకే.. ఫెర్ఫార్మెన్సే?
ఎవిక్షన్ పాస్ ప్రశాంత్ గెలుచుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక మిసెస్ బిగ్‌బాస్‌ని ఎవరో హత్య చేశారని, చంపిందెవరో కనుక్కోమని అర్జున్-అమర్‌కి బిగ్‌బాస్ టాస్క్ ఇవ్వడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. వీళ్లిద్దరూ కూడా ఇన్వెస్టిగేట్ ఆఫీసర్స్ ఇంద్రజిత్-కామ్‌జిత్ రోల్స్ చేశారు. అశ్విని-శోభాశెట్టి రిపోర్టర్స్‌గా, రతిక-గౌతమ్ సీక్రెట్ ప్రేమ జంటగా, యావర్-ప్రియాంక.. పని మనషులుగా నటించారు. శివాజీ, నువ్వు మర్డరర్ అని చెప్పిన బిగ్‌బాస్.. పోలీసులు దొరక్కుండా మరిన్నీ మర్డర్స్ చేయాలని సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?)

శోభా-అమర్ నస
సీరియల్ బ్యాచ్ అనగానే శోభా-అమర్-ప్రియాంక గుర్తొస్తారు. ఇప్పటివరకు ఒక్కటిగా ఆడుతూ వస్తున్న వీళ్ల మధ్య గ్యాప్ వస్తోంది. గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచిన తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. నేను గెలుస్తుంటే నీకు ఆనందంగా లేదని ఉన్న నిజాన్ని బయటపెట్టింది. ఇప్పుడు టాస్క్‌లో భాగంగా శోభా తన మైక్ పట్టుకుని పైపైకి వస్తుందని చెప్పి, ఓవర్ ల్యాప్ చేస్తున్నావ్ నువ్వు అని అమర్, ఆమెతో అన్నాడు. దీంతో శోభా హర్ట్ అయిపోయింది. స్మెల్ వస్తోంది, దూరంగా వెళ్లు అని పదేపదే అంటున్నాడని చెప్పి అమర్‌తో శోభా గొడవ పెట్టుకుంది.

ఈ వాదన ఎక్కువయ్యేసరికి అమర్.. తన లాఠీ విసిరేసి మరీ కాస్త అతి చేశాడు. వెనక్కి తోయడం అనేది యాక్టింగ్‌లో భాగం, నేను ఎవరినైనా కావాలని ఆపుతున్నానా అని అమర్ తన పాయింట్ చెప్పాడు. అయితే ఈ మాట తనని చూసి ఎందుకు అంటున్నావ్ అని అశ్విని, అమర్‌పై రెచ్చిపోయింది. గొడవ మీ ఇద్దరికీ జరిగితే నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావ్ అని అశ్విని అరిచింది. ఫెర్ఫార్మ్ చేయండ్రా అని బిగ్ బాస్ చెబితే సీరియల్ బ్యాచ్‌లోని అమర్-శోభా మాత్రం అనవసర వాదనలతో చాలా నస పెట్టేశారు. సీక్రెట్ టాస్క్‌లో భాగంగా రైతుబిడ్డ ప్రశాంత్ మొక్కని శివాజీ మాయం చేశాడు. అయితే మిగతా రోజులతో పోలిస్తే.. లేటెస్ట్ ఎపిసోడ్ చాలా నీరసంగా సాగింది. హౌస్‌మేట్స్ ఒక్కరు కూడా కనీసం ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వలేకపోయారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగింది. 

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement